నారాకోడూరులో ఎన్నికలను పరిశీలించిన జెసి
గుంటూరు : చేబ్రోలు మండలం నారాకోడూరు, వేజెండ్లలో గ్రామ పంచాయతీ ఎన్నికలను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదివారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లతో మాట్లాడి సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభించాలని అన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పక్కాగా చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కోమలి పద్మ, తాసిల్దార్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
సూర్య నాయక్