BREAKING
దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తుల జన సందోహం -  వైభవంగా (జాతర ) రథోత్సవం స్పెయిన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో మితవాద పార్టీల జోరు భావిగి భద్రేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నేరస్తుల ప్రవర్తన మారకుంటే కఠిన చర్యలు - ఏసిపి ప్రకాష్, సీఐ గోపతి రవీందర్ రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి - చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సిద్ధార్థ స్కూల్లో ప్రైమరీ విద్యార్థుల లిటిల్ థింకర్స్ కార్నివాల్ దీక్ష స్ఫూర్తి సభకు వేల మందితో దండు రక్షణ సాంకేతికత, ఆవిష్కరణలకు ఆధునిక తక్షశిలగా డీఐఏటీ ఎదగాలి డిసెంబర్ 1న సీపీఐ జైల్‌భరో.. కలెక్టరేట్ ముట్టడి పుణెలో 100వ సండేస్ ఆన్ సైకిల్ వేడుక రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి – మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న పటేల్ రాజ్యాంగ రూపశిల్పులలో ప్రముఖులు బీఎన్ రావుకు ప్రధాని మోదీ ఘన నివాళి కెనడాలో ప్రవాస భారతీయుల సేవా కార్యక్రమాలు తట్టివారిపల్లెని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా : ప్రజలకు టిడిపి సర్పంచ్ అభ్యర్థిని షేక్ రుక్సానా హామీ : ఉంగరం గుర్తుపై ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి

ఘనంగా అల్ఫోర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభం

Select Suryaa Now
ఘనంగా అల్ఫోర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభం
సూర్య కరీంనగర్ : స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో అల్ఫోర్స్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) క్రికెట్ పోటీలు విద్యార్థుల కేరింతల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్ వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు జట్టుగా పనిచేసే నైపుణ్యం, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమయపాలన, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. విద్యార్థుల ఆసక్తిని ప్రోత్సహించేందుకు లక్ష్య, తేజస్, ధృవ, సరస్ అనే నాలుగు విభాగాల మధ్య పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక రంగంలో ప్రతిభ దాగి ఉంటుందని, దానిని వెలికితీసి నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే అల్ఫోర్స్ విద్యాసంస్థల లక్ష్యమని చెప్పారు. విద్యార్థులను క్రీడాకారులుగా పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.