BREAKING
స్టేట్ ఆడిట్ టీఎన్జీవోస్ అనుబంధ ఫోరం ఎన్నికలు ఏకగ్రీవం ప్రశాంతంగా ముగిసిన ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష - కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఇరాన్ నిఘా మంత్రిత్వ శాఖ ప్రక్షాళన "సరళ దేవి" సేవలు చిరస్మరణీయం" - సరళా దేవికి ఘనంగా "సన్మానం". పాలెగాళ్ల కాలం నుంచి నేటి వరకు కొనసాగుతున్న కులాధిపత్యం విద్యతో పాటు రాజకీయ అవగాహన పెంచుకోవాలి మాజీ డీజీపీ డా. జె. పూర్ణచంద్రరావు అంతర్జాతీయ వాణిజ్య మేళాలో ఈపీఎఫ్ఓ పెవిలియన్‌కు కాంస్య పతకం నారీ శక్తి వందన్ సవరణ నేటి తక్షణ అవసరం దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తుల జన సందోహం -  వైభవంగా (జాతర ) రథోత్సవం స్పెయిన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో మితవాద పార్టీల జోరు భావిగి భద్రేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నేరస్తుల ప్రవర్తన మారకుంటే కఠిన చర్యలు - ఏసిపి ప్రకాష్, సీఐ గోపతి రవీందర్ రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి - చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సిద్ధార్థ స్కూల్లో ప్రైమరీ విద్యార్థుల లిటిల్ థింకర్స్ కార్నివాల్ దీక్ష స్ఫూర్తి సభకు వేల మందితో దండు

నేరస్తుల ప్రవర్తన మారకుంటే కఠిన చర్యలు - ఏసిపి ప్రకాష్, సీఐ గోపతి రవీందర్

Select Suryaa Now
నేరస్తుల ప్రవర్తన మారకుంటే కఠిన చర్యలు - ఏసిపి ప్రకాష్, సీఐ గోపతి రవీందర్
సూర్య నస్పూర్ : నేరాలకు స్వస్తి పలికి ప్రవర్తన మార్చుకోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని మంచిర్యాల ఏసీపీ ఆర్  ప్రకాష్, రూరల్ సీఐ జి  రవీందర్ హెచ్చరించారు. శనివారం అర్ధరాత్రి సమయంలో సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, పాత నేరస్తుల ఇళ్లకు వారు ఆకస్మికంగా వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి క్రిమినల్ కేసుల్లోనూ పాల్గొనవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని, అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.యువతను నేరాల వైపు ప్రోత్సహించకుండా మంచి మార్గంలో నడుచుకోవాలని తెలిపారు . పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మళ్లీ నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ ఎస్సై ఎండీ తాసిహీనుద్దీన్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.