BREAKING
"సరళ దేవి" సేవలు చిరస్మరణీయం" - సరళా దేవికి ఘనంగా "సన్మానం". పాలెగాళ్ల కాలం నుంచి నేటి వరకు కొనసాగుతున్న కులాధిపత్యం విద్యతో పాటు రాజకీయ అవగాహన పెంచుకోవాలి మాజీ డీజీపీ డా. జె. పూర్ణచంద్రరావు అంతర్జాతీయ వాణిజ్య మేళాలో ఈపీఎఫ్ఓ పెవిలియన్‌కు కాంస్య పతకం నారీ శక్తి వందన్ సవరణ నేటి తక్షణ అవసరం దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తుల జన సందోహం -  వైభవంగా (జాతర ) రథోత్సవం స్పెయిన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో మితవాద పార్టీల జోరు భావిగి భద్రేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నేరస్తుల ప్రవర్తన మారకుంటే కఠిన చర్యలు - ఏసిపి ప్రకాష్, సీఐ గోపతి రవీందర్ రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి - చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సిద్ధార్థ స్కూల్లో ప్రైమరీ విద్యార్థుల లిటిల్ థింకర్స్ కార్నివాల్ దీక్ష స్ఫూర్తి సభకు వేల మందితో దండు రక్షణ సాంకేతికత, ఆవిష్కరణలకు ఆధునిక తక్షశిలగా డీఐఏటీ ఎదగాలి డిసెంబర్ 1న సీపీఐ జైల్‌భరో.. కలెక్టరేట్ ముట్టడి పుణెలో 100వ సండేస్ ఆన్ సైకిల్ వేడుక

సిద్ధార్థ స్కూల్లో ప్రైమరీ విద్యార్థుల లిటిల్ థింకర్స్ కార్నివాల్

Select Suryaa Now
సిద్ధార్థ స్కూల్లో ప్రైమరీ విద్యార్థుల లిటిల్ థింకర్స్ కార్నివాల్
సూర్య చొప్పదండి : చొప్పదండి  సిద్ధార్థ  స్కూల్లో ప్రైమరీ విద్యార్థినీ విద్యార్థుల విద్యా విజ్ఞాన దాయకమైన  లిటిల్ థింకర్స్ కార్నివాల్  చాలా వైభవోపేతంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందస్తుగా సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్స్ దాసరి స్వప్న పాల్గొని సరస్వతీ దేవి కి కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు గల విద్యార్థులు వివిధ సబ్జెక్టులలో ఎంతో కష్టపడి తాము స్వయంగా తయారు చేసిన వివిధ రకాల ప్రాజెక్టులను
 ప్రదర్శించగా వారి వద్దకు వెళ్లి,అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారు.  ప్రశ్నలకు విద్యార్థులు చాలా చక్కని అవగాహనతో  సమాధానాలు బదులు చెప్పారు. సమయస్ఫూర్తితో విద్యార్థులు ఇచ్చిన సమాధానాలను చూసి వారిని చైర్మన్, డైరెక్టర్ విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులను ప్రశంసించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువు అనేది పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, తాము స్వయంగా అనుభవ పూర్వకంగా నేర్చుకున్నట్లయితే, ఆయా సబ్జెక్టులలో నైపుణ్యం అలవడడమే  కాకుండా అది తమ భవిష్యత్తులోఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఇలాంటి అంశాల పట్ల విద్యార్థులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారని తెలియజేశారు. ఇలాంటి విద్యా విజ్ఞానదాయకమైన కార్యక్రమాలు విద్యార్థులలో అవగాహన శక్తిని పెంచుతాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆయా సబ్జెక్టులలో విద్యార్థులు మంచి నైపుణ్యాన్ని సంపాదిస్తారని తెలియజేశారు. ఇందులో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనగా , తమ పిల్లలు ప్రదర్శించిన విద్యా విజ్ఞానదాయకమైన ప్రదర్శనను చూసి తమ సంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.