తట్టివారిపల్లెని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా : ప్రజలకు టిడిపి సర్పంచ్ అభ్యర్థిని షేక్ రుక్సానా హామీ : ఉంగరం గుర్తుపై ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి
మదనపల్లి రూరల్,మేజర్ న్యూస్ : ఒక అవకాశం ఇస్తే తట్టివారిపల్లెని ఆదర్శ పంచాయతీగా అభివృద్ధి చేస్తానని కూటమి బలపరిచిన టిడిపి అభ్యర్థి షేక్ రుక్సానా పేర్కొన్నారు.ఆదివారం తనభర్త,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎస్.ఆర్.షంషీర్,కూటమి శ్రేణులతో కలిసి పంచాయతీలో విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా రుక్సానా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో పంచాయతీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.గ్రామీణ రహదారులు మహర్ధశ సంతరించుకుంటున్నాయన్నారు.తనకు అవకాశం ఇస్తే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి,వారి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తానన్నారు.అనంతరం ఎస్.ఆర్.షంషీర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీ,ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారధ్యంలో మదనపల్లి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయన్నారు.తట్టివారిపల్లె పంచాయతీపై ఎమ్మెల్యే శ్రద్ధచూపుతున్నారని,మౌలిక సదుపాయాలు కల్పనకు కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేశారని కొనియాడారు.సర్పంచ్ అభ్యర్థిగా నా సతీమణి రుక్సానాకి పార్టీ అధిష్టానం,ఎమ్మెల్యే అవకాశం కల్పించారని డిసెంబర్ 2వ తేదీన జరిగే పంచాయతీ ఎన్నికలలో ఉంగరం గుర్తుకు ఓటువేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామకమిటీ అధ్యక్షులు షామీర్ బాషా,గుర్రప్ప నాయుడు,లక్ష్మీపతి,ముంబై దుర్గా,మహేష్,భాస్కర్,ఖాసీం, 3వ వార్డ్ మెంబర్ అభ్యర్థి వెంకటశివ,8వ వార్డ్ మెంబర్ అభ్యర్థి శాంత తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి