BREAKING
కరీంనగర్ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ చర్చ - ఎమ్మెల్యే అభ్యర్థిగా నరసన్న పటేల్ పేరు తెరపైకి! భారతీయ బెల్లం, చాక్లెట్లకు పెరుగుతున్న అంతర్జాతీయ డిమాండ్ గుంటూరులో పి.జి.ఆర్.ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గుంటూరులో పి.జి.ఆర్.ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గుంటూరులో పి.జి.ఆర్.ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఫోక్స్‌వ్యాగన్ వాదన తప్పుదోవ పట్టించేది అభిశంసన విచారణలో స్వయంగా సాక్ష్యం చెప్పనున్న ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలు సారా దుతెర్తే నారాకోడూరులో ఎన్నికలను పరిశీలించిన జెసి అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి - మేయర్ దర్ని మధుకర్ క్రీట్ సమీపంలో 1,700 మంది రక్షణ లేదా రాకతో తీవ్ర సంక్షోభం ఆయుధ ఎగుమతుల నిబంధనల సడలింపునకు స్విస్ ఓటర్ల మద్దతు రాయపాటి మృతి రాజకీయ రంగానికి తీరని లోటు: మాజీ మంత్రి డొక్కా ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న పంచముఖ హనుమాన్ ఆలయం - సినీ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ప్రత్యేక పూజలు ఐగాట్ కర్మయోగి ప్లాట్‌ఫామ్‌పై ఏఐ, టెక్నాలజీలో 3.25 కోట్ల కోర్సులు పూర్తి ప్రపంచ స్థాయిలో బిహార్, వడ్‌నగర్ మ్యూజియంలకు అరుదైన గుర్తింపు

ఐకమత్యమే కాపు జాతి అభివృద్ధికి పునాది: డేగల ప్రభాకర్

Select Suryaa Now
ఐకమత్యమే కాపు జాతి అభివృద్ధికి పునాది: డేగల ప్రభాకర్

గుంటూరు : గుంటూరు నగరంలోని గోర్లవారిపాలెంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్, 7 హిల్స్ ఫార్మసీ చైర్మన్ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో 'కాపు ఆత్మీయ కార్తీక వనసమారాధన' అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి గుంటూరు జిల్లా నలుమూలల నుంచి కాపు సోదరులు కుటుంబ సమేతంగా భారీ సంఖ్యలో తరలివచ్చారు.​ఈ సందర్భంగా నిర్వాహకులు డేగల ప్రభాకర్ మాట్లాడుతూ రాజకీయాలు, హోదాలకు అతీతంగా కాపులందరూ ఒకే వేదికపైకి వచ్చి ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. సమాజంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ విద్యార్థుల చదువులు, యువత ఉపాధి, మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు సామాజిక బంధాలను బలోపేతం చేస్తాయని, యువతకు విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో అవకాశాలు కల్పించేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, కాపు నాయకులు చందు జనార్దన్, చందు సాంబశివ రావు, కిలారి రోశయ్య, వడ్రానం హరిబాబు, ఉగ్గిరాల సీతారామయ్య, కార్పొరేటర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను డేగల ప్రభాకర్ శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

 

సూర్య నాయక్