BREAKING
కరీంనగర్ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ చర్చ - ఎమ్మెల్యే అభ్యర్థిగా నరసన్న పటేల్ పేరు తెరపైకి! భారతీయ బెల్లం, చాక్లెట్లకు పెరుగుతున్న అంతర్జాతీయ డిమాండ్ గుంటూరులో పి.జి.ఆర్.ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గుంటూరులో పి.జి.ఆర్.ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గుంటూరులో పి.జి.ఆర్.ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఫోక్స్‌వ్యాగన్ వాదన తప్పుదోవ పట్టించేది అభిశంసన విచారణలో స్వయంగా సాక్ష్యం చెప్పనున్న ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలు సారా దుతెర్తే నారాకోడూరులో ఎన్నికలను పరిశీలించిన జెసి అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి - మేయర్ దర్ని మధుకర్ క్రీట్ సమీపంలో 1,700 మంది రక్షణ లేదా రాకతో తీవ్ర సంక్షోభం ఆయుధ ఎగుమతుల నిబంధనల సడలింపునకు స్విస్ ఓటర్ల మద్దతు రాయపాటి మృతి రాజకీయ రంగానికి తీరని లోటు: మాజీ మంత్రి డొక్కా ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న పంచముఖ హనుమాన్ ఆలయం - సినీ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ప్రత్యేక పూజలు ఐగాట్ కర్మయోగి ప్లాట్‌ఫామ్‌పై ఏఐ, టెక్నాలజీలో 3.25 కోట్ల కోర్సులు పూర్తి ప్రపంచ స్థాయిలో బిహార్, వడ్‌నగర్ మ్యూజియంలకు అరుదైన గుర్తింపు

ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న పంచముఖ హనుమాన్ ఆలయం - సినీ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ప్రత్యేక పూజలు

Select Suryaa Now
ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న పంచముఖ హనుమాన్ ఆలయం - సినీ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ప్రత్యేక పూజలు
సూర్య, మందమర్రి: ఆధ్యాత్మిక ప్రశాంతతకు, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న మందమర్రి పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయం ప్రముఖుల సందర్శనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన అభిరుచితో విభిన్న కథాంశాలకు ప్రాధాన్యతనిస్తూ విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, 'శ్రీదేవి మూవీస్' అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఆదివారం ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కృష్ణప్రసాద్‌కు అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఆయనకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. వైవిధ్యమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందుతూ దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా కొనసాగుతున్న శివలెంక కృష్ణప్రసాద్, తన శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై విభిన్న కథాంశాలతో కూడిన ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కించిన 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు', 'భలేవాడివి బాసూ', 'మిత్రుడు' వంటి చిత్రాలు ఆయన నిర్మాణ అభిరుచికి నిదర్శనంగా నిలిచాయి. అదేవిధంగా 'చిన్నోడు పెద్దోడు', 'ఊయల', 'అనగనగా ఒక అమ్మాయి' చిత్రాలతో నిర్మాతగా తనదైన ముద్ర వేశారు. అనంతరం నాని కథానాయకుడిగా తెరకెక్కిన 'జెంటిల్‌మన్', సుధీర్‌బాబు నటించిన 'సమ్మోహనం', సమంత ప్రధాన పాత్రలో రూపొందించిన 'యశోద', ఇటీవల విడుదలైన 'సారంగపాణి జాతకం' వంటి చిత్రాలతో ప్రేక్షకుల ఆదరణ పొందారు. సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత పట్టణంలోని పంచముఖ హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం స్థానికంగా ఆసక్తిని కలిగించింది. ఆయన రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు.