BREAKING
భారతీయ బెల్లం, చాక్లెట్లకు పెరుగుతున్న అంతర్జాతీయ డిమాండ్ గుంటూరులో పి.జి.ఆర్.ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గుంటూరులో పి.జి.ఆర్.ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గుంటూరులో పి.జి.ఆర్.ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఫోక్స్‌వ్యాగన్ వాదన తప్పుదోవ పట్టించేది అభిశంసన విచారణలో స్వయంగా సాక్ష్యం చెప్పనున్న ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలు సారా దుతెర్తే నారాకోడూరులో ఎన్నికలను పరిశీలించిన జెసి అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి - మేయర్ దర్ని మధుకర్ క్రీట్ సమీపంలో 1,700 మంది రక్షణ లేదా రాకతో తీవ్ర సంక్షోభం ఆయుధ ఎగుమతుల నిబంధనల సడలింపునకు స్విస్ ఓటర్ల మద్దతు రాయపాటి మృతి రాజకీయ రంగానికి తీరని లోటు: మాజీ మంత్రి డొక్కా ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న పంచముఖ హనుమాన్ ఆలయం - సినీ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ప్రత్యేక పూజలు ఐగాట్ కర్మయోగి ప్లాట్‌ఫామ్‌పై ఏఐ, టెక్నాలజీలో 3.25 కోట్ల కోర్సులు పూర్తి ప్రపంచ స్థాయిలో బిహార్, వడ్‌నగర్ మ్యూజియంలకు అరుదైన గుర్తింపు మాదకద్రవ్యాల మహమ్మారిపై ప్రధాని మోదీ ఆందోళన

నూతన మోటార్‌తో తీరిన తాగునీటి సమస్య

Select Suryaa Now
నూతన మోటార్‌తో తీరిన తాగునీటి సమస్య
సూర్య, పెంచికల్‌పేట్: పెంచికల్‌పేట్ మండలంలోని కమ్మర్‌గామ్ గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా గ్రామపంచాయతీ సర్పంచ్ కొండ్రా సులోచన భాస్కర్ గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులను గుర్తించి నూతన మోటార్‌ను ఏర్పాటు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించారు. నూతనంగా ఏర్పాటు చేసిన మోటార్‌ను సర్పంచ్ కొండ్రా సులోచన భాస్కర్ గౌడ్ ప్రారంభించారు.గ్రామ ప్రజలకు నిరంతర నీటి సరఫరా అందించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నూతన మోటార్ ఏర్పాటు చేయడంతో నీటి సరఫరా సమస్యకు పరిష్కారం లభించిందని, గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.తాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపిన సర్పంచ్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించేందుకు గ్రామపంచాయతీ తరఫున నిరంతరం కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమం లో గ్రామస్తులు పాల్గొన్నారు.