telangana
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి - మేయర్ దర్ని మధుకర్
సూర్య నస్పూర్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ సూచించారు. ఆదివారం 31వ డివిజన్ బుడగ జంగాల కాలనీలో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ కుటుంబ బీమా పథకం లబ్ధిదారుల నమోదు కేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ తాళ్ల సంపత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అర్హులైన కుటుంబాలన్నీ నమోదు చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కార్పొరేషన్ అభివృద్ధి నిధులతో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. కాలనీలో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.