BREAKING
రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి - చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సిద్ధార్థ స్కూల్లో ప్రైమరీ విద్యార్థుల లిటిల్ థింకర్స్ కార్నివాల్ దీక్ష స్ఫూర్తి సభకు వేల మందితో దండు రక్షణ సాంకేతికత, ఆవిష్కరణలకు ఆధునిక తక్షశిలగా డీఐఏటీ ఎదగాలి డిసెంబర్ 1న సీపీఐ జైల్‌భరో.. కలెక్టరేట్ ముట్టడి పుణెలో 100వ సండేస్ ఆన్ సైకిల్ వేడుక రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి – మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న పటేల్ రాజ్యాంగ రూపశిల్పులలో ప్రముఖులు బీఎన్ రావుకు ప్రధాని మోదీ ఘన నివాళి కెనడాలో ప్రవాస భారతీయుల సేవా కార్యక్రమాలు తట్టివారిపల్లెని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా : ప్రజలకు టిడిపి సర్పంచ్ అభ్యర్థిని షేక్ రుక్సానా హామీ : ఉంగరం గుర్తుపై ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి ఘనంగా అల్ఫోర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభం సండేస్ ఆన్ సైకిల్ 100 ఎడిషన్లు పూర్తి వైఎస్సార్సీపీతోనే గ్రామపంచాయతీలకు మహర్ధశ : బసినికొండ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని ఎస్.ముబీనా వెల్లడి : కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి కరీంనగర్ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ చర్చ - ఎమ్మెల్యే అభ్యర్థిగా నరసన్న పటేల్ పేరు తెరపైకి! భారతీయ బెల్లం, చాక్లెట్లకు పెరుగుతున్న అంతర్జాతీయ డిమాండ్

సండేస్ ఆన్ సైకిల్ 100 ఎడిషన్లు పూర్తి

Select Suryaa Now
సండేస్ ఆన్ సైకిల్ 100 ఎడిషన్లు పూర్తి

సూర్య జాతీయ డెస్క్: ఫిట్ ఇండియా ఉద్యమం కింద చేపట్టిన సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం వంద ఎడిషన్లను విజయవంతంగా పూర్తి చేసుకుందని, దీని ద్వారా ప్రజలలో శారీరక దృఢత్వంపై అవగాహన పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 140వ ఎపిసోడ్‌లో ఆదివారం ఆయన ప్రసంగిస్తూ, 2024 డిసెంబర్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఒక్క ఆదివారం కూడా అంతరాయం లేకుండా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 30,000కు పైగా ప్రాంతాలలో 37 లక్షలకు పైగా ప్రజలు ఈ సైక్లింగ్ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని వెల్లడించారు. శీతాకాలంలో మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఆరోగ్యం, వ్యాయామంపై మరింత శ్రద్ధ పెట్టాలని, ఆహారంలో నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని, ఊబకాయాన్ని నిర్లక్ష్యం చేయవద్దని ప్రజలకు సూచించారు.

భారత క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై వరుస విజయాలతో కొత్త మైలురాళ్లను సాధిస్తున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు. 2032 యూసీఐ రోడ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు పుణె నగరం ఆతిథ్యం ఇవ్వనుండటం గర్వకారణమని పేర్కొన్నారు. భారత ఫుట్‌బాల్ జట్టు రికార్డు స్థాయిలో 10వ సారి సాఫ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుందని తెలిపారు. బ్యాడ్మింటన్‌లో లక్ష్య సేన్ జర్మనీ, జపాన్‌లలో వరుసగా రెండు సూపర్ 500 టైటిళ్లను గెలుచుకోవడంతో పాటు కుమమోటో మాస్టర్స్ గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచాడని, అలాగే పీవీ సింధు హైలో ఓపెన్ టైటిల్ సాధించి భారత్‌కు మరో విజయాన్ని అందించారని కొనియాడారు.

త్వరలో జరగనున్న ఎనిమిదో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో పాల్గొనే యువ క్రీడాకారులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడలలో 27 పోటీ అంశాలతో పాటు రెండు ప్రదర్శన క్రీడలు ఉంటాయని, సాఫ్ట్‌బాల్ పోటీ విభాగంలో తొలిసారిగా అడుగుపెడుతుండగా, సెయిలింగ్, కర్ర సాము ప్రదర్శన క్రీడలుగా నిలుస్తాయని వివరించారు. యువ క్రీడాకారులు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ క్రీడలలో రాణించాలని ఆకాంక్షించారు.

దేశ ప్రజలు తమ ఆరోగ్యాన్ని, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఫిట్ ఇండియా సందేశాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామాన్ని జీవనశైలిలో భాగంగా మార్చుకోవాలని ఆయన సూచించారు.