BREAKING
రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి - చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సిద్ధార్థ స్కూల్లో ప్రైమరీ విద్యార్థుల లిటిల్ థింకర్స్ కార్నివాల్ దీక్ష స్ఫూర్తి సభకు వేల మందితో దండు రక్షణ సాంకేతికత, ఆవిష్కరణలకు ఆధునిక తక్షశిలగా డీఐఏటీ ఎదగాలి డిసెంబర్ 1న సీపీఐ జైల్‌భరో.. కలెక్టరేట్ ముట్టడి పుణెలో 100వ సండేస్ ఆన్ సైకిల్ వేడుక రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి – మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న పటేల్ రాజ్యాంగ రూపశిల్పులలో ప్రముఖులు బీఎన్ రావుకు ప్రధాని మోదీ ఘన నివాళి కెనడాలో ప్రవాస భారతీయుల సేవా కార్యక్రమాలు తట్టివారిపల్లెని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా : ప్రజలకు టిడిపి సర్పంచ్ అభ్యర్థిని షేక్ రుక్సానా హామీ : ఉంగరం గుర్తుపై ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి ఘనంగా అల్ఫోర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభం సండేస్ ఆన్ సైకిల్ 100 ఎడిషన్లు పూర్తి వైఎస్సార్సీపీతోనే గ్రామపంచాయతీలకు మహర్ధశ : బసినికొండ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని ఎస్.ముబీనా వెల్లడి : కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి కరీంనగర్ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ చర్చ - ఎమ్మెల్యే అభ్యర్థిగా నరసన్న పటేల్ పేరు తెరపైకి! భారతీయ బెల్లం, చాక్లెట్లకు పెరుగుతున్న అంతర్జాతీయ డిమాండ్

కరీంనగర్ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ చర్చ - ఎమ్మెల్యే అభ్యర్థిగా నరసన్న పటేల్ పేరు తెరపైకి!

Select Suryaa Now
కరీంనగర్ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ చర్చ - ఎమ్మెల్యే అభ్యర్థిగా నరసన్న పటేల్ పేరు తెరపైకి!
సూర్య కరీంనగర్ ప్రతినిధి: కరీంనగర్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరిగి కరీంనగర్ ప్రాంతంలో రెండు అసెంబ్లీ స్థానాలు ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ప్రస్తుతం కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్న ఆకుల నరసన్న పటేల్ పేరు రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ఆకుల నరసన్న పటేల్ గుర్తింపు పొందుతున్నారు. గతంలో సింగిల్ విండో చైర్మన్‌గా పనిచేసిన అనుభవంతో పాటు, ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సహకార రంగంలో అనుభవం, రైతులతో అనుబంధం, పార్టీ శ్రేణులతో సత్సంబంధాలు ఆయన రాజకీయ బలంగా భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో డీలిమిటేషన్‌తో కరీంనగర్‌కు రెండు అసెంబ్లీ స్థానాలు ఏర్పడితే వాటిలో ఒక స్థానం ఆకుల నరసన్న పటేల్‌కు కేటాయించే అవకాశం ఉందా? పార్టీ అధిష్ఠానం ఆయన సేవలను గుర్తించి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పిస్తుందా? అనే ప్రశ్నలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.అయితే డీలిమిటేషన్, నియోజకవర్గాల సంఖ్య, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలపై ఇంకా అధికారిక స్పష్టత లేదు. ప్రస్తుతానికి ఇవన్నీ రాజకీయ వర్గాల్లో సాగుతున్న ఊహాగానాలు, చర్చలు మాత్రమే. రానున్న రోజుల్లో కరీంనగర్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి!