వైఎస్సార్సీపీతోనే గ్రామపంచాయతీలకు మహర్ధశ : బసినికొండ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని ఎస్.ముబీనా వెల్లడి : కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి
మదనపల్లి,మేజర్ న్యూస్ : గ్రామపంచాయతీల పురోగతి వైఎస్ఆర్సిపితోనే సాధ్యమని బసినికొండ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని ఎస్.ముబీనా పేర్కొన్నారు.ఆదివారం వైకాపా సీనియర్ నాయకులు,తన భర్త మహబూబ్ బాషా,పార్టీ శ్రేణులతో కలిసి పంచాయతీ పరిధిలో ముమ్మర ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందించారని,నవరత్నాలు పథకాలు అమలు చేసి ప్రజల జీవితాలలో వెలుగులు నింపారని కొనియాడారు.గతంలో నన్ను బసినికొండ ఎంపిటిసిగా గెలిపించారని,దీంతో పంచాయతీలోని ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశామని గుర్తుచేశారు.మరోసారి పార్టీ అధిష్టానం సర్పంచి అభ్యర్థిగా అవకాశం కల్పించిందని,మళ్లీ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే ప్రజాసమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తానని,బసినికొండను ఆదర్శ పంచాయతీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.కావున డిసెంబర్ 2న జరిగే పంచాయతీ ఎన్నికలలో కత్తెర గుర్తుపై ఓటువేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటరమణ,మాజీ వైస్ సర్పంచ్ బావాజాన్,వైసీపి నాయకులు నవాజ్,మౌల,బాబీ,శీనా,విమలమ్మ,అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి