చీరాలలో క్షుద్ర పూజల కలకలం..!
చీరాలలో క్షుద్ర పూజల కలకలం..!
చీరాల పట్టణం జయంతిపేటలో క్షుద్ర పూజల వ్యవహారం కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో జరుగుతున్న పూజలను గమనించిన స్థానికులు ఆందోళనకు దిగారు. భార్య అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఇంటి యజమాని ఈ పూజలు చేయిస్తున్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు పూజలు చేయిస్తున్న వ్యక్తితో పాటు పూజలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.