telangana
రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తోంది : కోట నీలిమ
అమీర్పేట,మేజర్ న్యూస్:బిజెపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు,సనత్నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ ఆరోపించారు.కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సంవిధాన్ రక్షా మార్చ్ లో సీఎం రేవంత్ రెడ్డి,ఏఐసీసీ ఇంచార్జి బి.ఎం.సందీప్ కుమార్,టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు,ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని విమర్శించారు.రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తోందని విమర్శించారు.రాజ్యాంగం అందించిన సమాన హక్కులు,స్వేచ్ఛ,సామాజిక న్యాయం ప్రజలందరికీ అందినప్పుడే ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతుందన్నారు.రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తిని,ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని స్పష్టం చేశారు.ప్రతి ఒక్కరూ సంవిధాన్ బచావ్ ఆందోళన్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సనత్నగర్ నియోజకవర్గానికి చెందిన నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.