telangana
కాంగ్రెస్ 'సంవిధాన్ రక్షక్ మార్చ్' కు..ర్యాలీగా తరలిన 'మైనంపల్లి'
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యం లో గురువారం 'సర్' కు వ్యతిరేకంగా నగరం లో చేపట్టిన 'సంవిధాన్ రక్షక్ మార్చ్' ర్యాలీకి మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీతో తరలి వెళ్ళారు. మల్కాజిగిరి ఆనంద్ బాగ్ చౌరస్తా మీదుగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు తరలి వెళ్లారు. అక్కడి నుంచి నెక్లస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం వరకు నిర్వహిం చిన ఈ ర్యాలీలో యువనేత,మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సారథ్యంలో ఆయ న అనుచరులతో పాటుగా మల్కాజిగిరి, మౌలాలి సర్కిళ్ల పరిధిలలోని డివిజన్ అధ్య క్షులు, కాంగ్రెస్ నాయకులు భాగస్వా మ్యమై నారు. ఈ సందర్భంగా మైనంపల్లి హన్మంత రావు మాట్లాడుతూ..పాలకులను ఎన్నుకు నేందుకు భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పిస్తే, ఆ హక్కును దక్కకుండా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోం దని విమర్శించారు. ముఖ్యంగా పేదలు, అణ గారిన వర్గాలకు ఓటు హక్కు ఉండొద్దని
బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎంద రో వీరుల త్యాగాలు, కాంగ్రెస్ అహింసాయు త పోరాటంతోనే స్వాతంత్ర్యం సిద్ధించింద న్నారు. లక్షలాది మంది ఓట్లు తొలగించి, మాయ మాటలతో మోదీ అధికారంలోకి వచ్చారని ఆయన విమర్శించారు. గాడ్సే
వారసులను ఓడించాలంటే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించా రు. రాజ్యాంగ హక్కులు పరిరక్షణ ప్రతి ఒక్క రి బాధ్యత అన్నారు. సమానత్వం, సామాజి క న్యాయం కావాలంటే, కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని మైనంపల్లి హన్మంత రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి బీ బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్,వివిధ డివిజన్ల అధ్యక్షులు జీడి సంపత్ గౌడ్, పోతుల వినోద్ యాదవ్, పిట్టల నాగరాజు, వైనాల ప్రవీణ్, యూసఫ్,సీనియర్ నాయకులు బీ కే శ్రీనివాస్, పిట్టల శ్రీనివాస్, జీ ఎన్ వీ సతీష్ కుమార్, కపిలేశ్వర్,ఫరూక్,
మబుషరుద్ధీన్ (మబ్బూ), సంతోష్ రాందాస్, సలీమ్, సత్యనారాయణ, చుంకు శ్రీనివాస్ వై.శంకర్, షకీల్, మంద భాస్కర్, ధరణ్ కుమార్, రాము తదితరులు పాల్గొన్నారు