BREAKING
యాదమరిలో ఎన్నికల బందోబస్తుకు 100 మంది పోలీసులు దేశ సేవే లక్ష్యంగా బీజేపీ నిరంతర కృషి: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రానికి ఖర్గే హెచ్చరిక డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు మేకల కాస్తుండగా రైలు ఢీకొని ఓ మహిళా మృతి.. మాల్దీవుల వెకేషన్ ఫొటోలతో ఆకట్టుకుంటున్న నటి సాక్షి మాలిక్.. గ్లామర్ లుక్ వైరల్ *ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలంలో పులి సంచారం కలకలం!* *అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు ఫారెస్ట్ అధికారుల సూచన* మాస్ ప్రయోగాలకు బ్రేక్.. ఫ్యామిలీ, లవ్ స్టోరీలపై నాని దృష్టి విజయ్ సేతుపతి, మిస్కిన్ కాంబోలో ‘ట్రైన్’ ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 4న థియేటర్లలోకి కంఫర్ట్ జోన్ దాటి విభిన్న పాత్రలే లక్ష్యం.. వృషకర్మ విశేషాలు పంచుకున్న మీనాక్షి చౌదరి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం.... ముగ్గురు ఆడపిల్లలు మృతి ఉత్సవాలకు హాజరుకావాలని ఎంపీకి ఆహ్వానం వచ్చే ఎన్నికలే లక్ష్యం: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్ యాక్షన్ ప్లాన్ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

పారిశుధ్య నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవు *జీహెచ్‌ఎంసీ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో విస్తృత తనిఖీలు

Select Suryaa Now
పారిశుధ్య నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవు  *జీహెచ్‌ఎంసీ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో విస్తృత తనిఖీలు

హైదరాబాద్ మేజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి):నగరంలో పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు పారిశుధ్య నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ చేపట్టిన నాలుగు వారాల ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా నవంబర్ 26న 3వ వారం 15వ రోజు కార్యాచరణలో భాగంగా నగరవ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని మొత్తం 30 సర్కిళ్లలో దుకాణాలు, వీధి వ్యాపారుల వద్ద అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. రోడ్లపై చెత్త వేయడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చడం, అక్రమంగా వ్యర్థాలను డంపింగ్ చేయడం, నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
45 మందికి స్పాట్ ఫైన్లు
ఈ తనిఖీల్లో మొత్తం 262 దుకాణాలు, వీధి వ్యాపారులను తనిఖీ చేయగా, నిబంధనలు ఉల్లంఘించిన 45 మందిపై స్పాట్ ఫైన్లు విధించారు. వీరి నుంచి మొత్తం రూ.25,400 జరిమానా వసూలు చేశారు. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నాలుగు వారాల పాటు ప్రత్యేక కార్యక్రమం
జీహెచ్‌ఎంసీ ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని 2026 నవంబర్ 9 నుంచి డిసెంబర్ 5 వరకు మొత్తం నాలుగు వారాల పాటు అన్ని 30 సర్కిళ్లలో నిర్వహిస్తోంది. 'ప్రగతి 50 నగరాల' ఫ్రేమ్‌వర్క్‌లో నిర్దేశించిన కీలక పనితీరు సూచికల ఆధారంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతి వారానికి ఒక ప్రత్యేక థీమ్‌ను నిర్ణయించడంతో పాటు, ప్రతి పనిదినానికి నిర్దిష్ట కార్యాచరణను అమలు చేస్తున్నారు.
నగరంలో పరిశుభ్రత ప్రమాణాలను పెంపొందించడం, ప్రజల్లో పారిశుధ్యంపై అవగాహన కల్పించడం, నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యాలుగా జీహెచ్‌ఎంసీ పేర్కొంది.