BREAKING
బంగ్లాదేశ్ సంక్షోభంతో భారత్‌కు పెరుగుతున్న దుస్తుల తయారీ ఆర్డర్లు.. దేశీయ పరిశ్రమకు కలిసొస్తున్న అవకాశం! యాదమరిలో ఎన్నికల బందోబస్తుకు 100 మంది పోలీసులు దేశ సేవే లక్ష్యంగా బీజేపీ నిరంతర కృషి: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రానికి ఖర్గే హెచ్చరిక డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు మేకల కాస్తుండగా రైలు ఢీకొని ఓ మహిళా మృతి.. మాల్దీవుల వెకేషన్ ఫొటోలతో ఆకట్టుకుంటున్న నటి సాక్షి మాలిక్.. గ్లామర్ లుక్ వైరల్ *ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలంలో పులి సంచారం కలకలం!* *అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు ఫారెస్ట్ అధికారుల సూచన* మాస్ ప్రయోగాలకు బ్రేక్.. ఫ్యామిలీ, లవ్ స్టోరీలపై నాని దృష్టి విజయ్ సేతుపతి, మిస్కిన్ కాంబోలో ‘ట్రైన్’ ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 4న థియేటర్లలోకి కంఫర్ట్ జోన్ దాటి విభిన్న పాత్రలే లక్ష్యం.. వృషకర్మ విశేషాలు పంచుకున్న మీనాక్షి చౌదరి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం.... ముగ్గురు ఆడపిల్లలు మృతి ఉత్సవాలకు హాజరుకావాలని ఎంపీకి ఆహ్వానం వచ్చే ఎన్నికలే లక్ష్యం: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్ యాక్షన్ ప్లాన్

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు

Select Suryaa Now
డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన స్పందనను తెలియజేశారు. రాజ్యసభలో ఉన్న తమ పార్టీ ముగ్గురు ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారని ఆయన స్పష్టం చేశారు.

పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల 24 శాతం ప్రాతినిధ్య వాటాను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపు విధానం అమలైతే తెలంగాణలోని లోక్‌సభ స్థానాల సంఖ్య 17 నుంచి 26కు పెరుగుతుందని, ఇది రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరమని ఆయన అభిప్రాయపడ్డారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని కోరారు.
 
మరోవైపు, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కల్పనకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, గతంలోనూ ఇందుకు పూర్తి మద్దతు ఇచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు. మహిళల రాజకీయ సాధికారతతో పాటు దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణే తమ పార్టీ ప్రధాన ఎజెండా అని ఆయన స్పష్టం చేశారు.