BREAKING
*ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలంలో పులి సంచారం కలకలం!* *అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు ఫారెస్ట్ అధికారుల సూచన* మాస్ ప్రయోగాలకు బ్రేక్.. ఫ్యామిలీ, లవ్ స్టోరీలపై నాని దృష్టి విజయ్ సేతుపతి, మిస్కిన్ కాంబోలో ‘ట్రైన్’ ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 4న థియేటర్లలోకి కంఫర్ట్ జోన్ దాటి విభిన్న పాత్రలే లక్ష్యం.. వృషకర్మ విశేషాలు పంచుకున్న మీనాక్షి చౌదరి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం.... ముగ్గురు ఆడపిల్లలు మృతి ఉత్సవాలకు హాజరుకావాలని ఎంపీకి ఆహ్వానం వచ్చే ఎన్నికలే లక్ష్యం: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్ యాక్షన్ ప్లాన్ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* ఆకాశంలో ఒక తార సక్సెస్.. దుల్కర్ లేకపోతే ఇంత అందమైన సినిమా చూసేవాళ్లం కాదు: రాజమౌళి నోముల–ఆగపల్లి లింక్ రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి బీఆర్‌ఎస్‌ ఇడుపు కాయితం నుంచి ఉల్లిపూల సాంగ్ రిలీజ్.. ప్రియదర్శి, నాగదుర్గ జోడీకి మంచి స్పందన *తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ - 2026 రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషం.* ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవురామ్ దంపతులను కలసిన సర్పంచ్ చెవ్వా శివారెడ్డి విదేశీ ఉద్యోగాలకు తోడ్పాటు.. రూ.1.75 లక్షల వరకు ఆర్థిక సా 48 ఏళ్ల క్రితం ఆ అలవాటు తిరస్కరించా.. అందుకే మెగాస్టార్ అయ్యా: నషా ముక్త్ భారత్ వేదికపై చిరంజీవి

కంఫర్ట్ జోన్ దాటి విభిన్న పాత్రలే లక్ష్యం.. వృషకర్మ విశేషాలు పంచుకున్న మీనాక్షి చౌదరి

Select Suryaa Now
కంఫర్ట్ జోన్ దాటి విభిన్న పాత్రలే లక్ష్యం.. వృషకర్మ విశేషాలు పంచుకున్న మీనాక్షి చౌదరి

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: నాగచైతన్య ప్రధాన పాత్రలో, కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న వృషకర్మ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటి మీనాక్షి చౌదరి. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన ఆమె, తన పాత్రతో పాటు కెరీర్ ప్రయాణంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. లక్కీ భాస్కర్ చిత్రం తర్వాత తనకు మదర్ రోల్స్ ఎక్కువగా వచ్చాయని, అయితే ఇప్పటికే అలాంటి పాత్ర చేసినందున మళ్లీ అదే తరహా పాత్రలు చేయడం ఇష్టం లేదని స్పష్టం చేశారు. తన కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చి కొత్త తరహా పాత్రలతో నటిగా తనను తాను నిరూపించుకోవాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.

వృషకర్మ చిత్రంలో తాను పోషిస్తున్న దక్ష పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని మీనాక్షి పేర్కొన్నారు. కథ చెప్పే సమయంలోనే దర్శకుడు కార్తీక్ దండు ఈ పాత్ర లక్షణాలపై స్పష్టత ఇచ్చారని, ఆర్కియాలజీలో థీసిస్ చేసే యువతిగా దక్ష పాత్ర ప్రయాణం ఆసక్తికరంగా సాగుతుందని వివరించారు. కథ విన్న అనంతరం నాగచైతన్యతో కలిసి రెండు రోజుల పాటు వర్క్‌షాప్ నిర్వహించామని, అనేక సన్నివేశాలకు రిహార్సల్స్ చేయడం ద్వారా పాత్ర లోతులను అర్థం చేసుకున్నానని చెప్పారు. పురావస్తు శాస్త్రానికి సంబంధించిన పలు అంశాలను కూడా ఈ ప్రాజెక్ట్ కోసం తెలుసుకున్నానని వెల్లడించారు.

ఎత్తైన ప్రదేశాలలో చిత్రీకరించిన సన్నివేశాల గురించి ప్రస్తావిస్తూ, తనకు హైట్స్ అంటే భయం ఉన్నప్పటికీ ఆ సన్నివేశాలను ఎంతో సవాలుగా, సరదాగా పూర్తి చేశానని మీనాక్షి తెలిపారు. భారీ స్థాయిలో సీజీ, వీఎఫ్ఎక్స్ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రంలో అజనీష్ సంగీతం, నేపథ్య సంగీతం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయని అన్నారు. హారర్, థ్రిల్లర్, డిటెక్టివ్ జానర్లంటే తనకు ఎంతో ఇష్టమని, అందుకే ఈ కథను అంగీకరించానని చెప్పారు.

తదుపరి ప్రాజెక్టుల వివరాలను వెల్లడిస్తూ, కార్తీతో చేస్తున్న చిత్రంలో తన భాగం షూటింగ్ సుమారు 60 శాతం పూర్తయిందని మీనాక్షి తెలిపారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి ఓ వెబ్‌సిరీస్‌తో పాటు హిందీలోనూ ఓ సినిమా చేస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంలో నటించాలనే కోరిక ఉందని, వృషకర్మకు సీక్వెల్ ఉంటుందా లేదా అనేది సినిమా చూస్తే తెలుస్తుందని ఆసక్తి రేకెత్తించారు.