ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం.... ముగ్గురు ఆడపిల్లలు మృతి
కన్నతల్లే పిల్లలను కడతేర్చింది
కన్న పిల్లల్ని సంపు గుంతలో వేసి తాను దూకి ఆత్మహత్య యత్నం*
*ముగ్గురు ఆడపిల్లల మృతి*
*ప్రాణాలతో బయట పడిన తల్లి*
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో హృదయ విదారకరమైన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు గ్రామానికి చెందిన కందెన చెన్నయ్య దంపతులు ఇద్దరు గొడవపడ్డారు. దీంతో మనస్తాపం చెందిన బార్య తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇంట్లోనే ఉన్న నీటి సంపులో దుంకింది. దీంతో ముగ్గురు కూతుళ్లు మృతి చెందగా తల్లి ప్రాణాలతో బయట పడినట్లు ప్రస్తుత సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాఘవేందర్ గౌడ్ మేజర్ న్యూస్