BREAKING
విజయ్ సేతుపతి, మిస్కిన్ కాంబోలో ‘ట్రైన్’ ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 4న థియేటర్లలోకి కంఫర్ట్ జోన్ దాటి విభిన్న పాత్రలే లక్ష్యం.. వృషకర్మ విశేషాలు పంచుకున్న మీనాక్షి చౌదరి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం.... ముగ్గురు ఆడపిల్లలు మృతి ఉత్సవాలకు హాజరుకావాలని ఎంపీకి ఆహ్వానం వచ్చే ఎన్నికలే లక్ష్యం: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్ యాక్షన్ ప్లాన్ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* ఆకాశంలో ఒక తార సక్సెస్.. దుల్కర్ లేకపోతే ఇంత అందమైన సినిమా చూసేవాళ్లం కాదు: రాజమౌళి నోముల–ఆగపల్లి లింక్ రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి బీఆర్‌ఎస్‌ ఇడుపు కాయితం నుంచి ఉల్లిపూల సాంగ్ రిలీజ్.. ప్రియదర్శి, నాగదుర్గ జోడీకి మంచి స్పందన *తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ - 2026 రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషం.* ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవురామ్ దంపతులను కలసిన సర్పంచ్ చెవ్వా శివారెడ్డి విదేశీ ఉద్యోగాలకు తోడ్పాటు.. రూ.1.75 లక్షల వరకు ఆర్థిక సా 48 ఏళ్ల క్రితం ఆ అలవాటు తిరస్కరించా.. అందుకే మెగాస్టార్ అయ్యా: నషా ముక్త్ భారత్ వేదికపై చిరంజీవి ఇంట్లో వర్కౌట్ దృశ్యాలు పంచుకున్న రష్మిక మందన్న.. గాయం తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి భోగి సినిమాపై తీవ్ర విమర్శలు, ట్రోల్స్.. రక్తపాతంపై నెటిజన్ల అసహనం

ఆకాశంలో ఒక తార సక్సెస్.. దుల్కర్ లేకపోతే ఇంత అందమైన సినిమా చూసేవాళ్లం కాదు: రాజమౌళి

Select Suryaa Now
ఆకాశంలో ఒక తార సక్సెస్.. దుల్కర్ లేకపోతే ఇంత అందమైన సినిమా చూసేవాళ్లం కాదు: రాజమౌళి

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆకాశంలో ఒక తార చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంపై ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, సినిమా కథనం, నటీనటుల ప్రతిభ, నిర్మాతల కృషిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం ఇంత గొప్ప స్థాయిలో రూపొందడానికి నిర్మాత స్వప్న దత్ కృషే ప్రధాన కారణమని, ఈ విజయపు క్రెడిట్ ఆమెకే దక్కుతుందని రాజమౌళి కొనియాడారు.

హీరో దుల్కర్ సల్మాన్ గురించి మాట్లాడుతూ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆకాశంలో ఒక తార చిత్రాన్ని దుల్కర్ తన భుజాలపై వేసుకుని నడిపించారని, ఆయన లేకపోతే ఇంతటి అందమైన, హృదయాన్ని హత్తుకునే సినిమాను తెలుగు ప్రేక్షకులు చూసే అవకాశం ఉండేది కాదని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ దుల్కర్‌ను ఎప్పుడో తమ సొంత మనిషిగా స్వీకరించిందని, తమ్మీ నువ్వు మావాడివే అంటూ అభిమానంగా పేర్కొన్నారు. కథానాయిక సాత్విక వీరవల్లి నటన అద్భుతంగా ఉందని, ఆమె త్వరగా తెలుగు నేర్చుకుంటే భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆకాంక్షించారు.

సినిమా స్క్రీన్‌ప్లే, సంభాషణలపై స్పందిస్తూ, కథ ప్రారంభం నుంచి ముగింపు వరకు భావోద్వేగాలను అద్భుతంగా మేళవించారని రాజమౌళి ప్రశంసించారు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో కల్పన, నాజర్ పాత్రల మధ్య వచ్చే దృశ్యాలు చూసి తాను తీవ్ర ఉద్వేగానికి లోనయ్యానని తెలిపారు. గుణ్ణం గంగరాజు కలం నుంచి జాలువారిన సంభాషణలు సినిమాకు ప్రాణం పోశాయని, శ్రుతి హాసన్, రుహాని శర్మ, శ్వాసిక తదితరులు తమ పాత్రల్లో ఎంతో సహజంగా ఒదిగిపోయారని అభినందించారు.

నిర్మాత అల్లు అరవింద్ గురించి సరదాగా వ్యాఖ్యానిస్తూ, గర్ల్ ఫ్రెండ్, ఆకాశంలో ఒక తార, ఎంఎస్ సుబ్బలక్ష్మి వంటి అవార్డు స్థాయి చిత్రాలను ఆయన నిర్మిస్తున్నారని, అయితే యువ నిర్మాతలతో కలిసి చేయడం వల్ల క్రెడిట్ అంతా వారికే వెళ్తోందని అన్నారు. మగధీర తరహాలో ఆయన సోలో నిర్మాణంలో మరో భారీ చిత్రం చేయాలని కోరారు. ఇంకా ఈ చిత్రాన్ని చూడని ప్రేక్షకులు తప్పకుండా ఈ వారాంతంలో థియేటర్లకు వెళ్లి ఆకాశంలో ఒక తారను వీక్షించాలని రాజమౌళి పిలుపునిచ్చారు.