BREAKING
వచ్చే ఎన్నికలే లక్ష్యం: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్ యాక్షన్ ప్లాన్ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* ఆకాశంలో ఒక తార సక్సెస్.. దుల్కర్ లేకపోతే ఇంత అందమైన సినిమా చూసేవాళ్లం కాదు: రాజమౌళి నోముల–ఆగపల్లి లింక్ రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి బీఆర్‌ఎస్‌ ఇడుపు కాయితం నుంచి ఉల్లిపూల సాంగ్ రిలీజ్.. ప్రియదర్శి, నాగదుర్గ జోడీకి మంచి స్పందన *తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ - 2026 రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషం.* ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవురామ్ దంపతులను కలసిన సర్పంచ్ చెవ్వా శివారెడ్డి విదేశీ ఉద్యోగాలకు తోడ్పాటు.. రూ.1.75 లక్షల వరకు ఆర్థిక సా 48 ఏళ్ల క్రితం ఆ అలవాటు తిరస్కరించా.. అందుకే మెగాస్టార్ అయ్యా: నషా ముక్త్ భారత్ వేదికపై చిరంజీవి ఇంట్లో వర్కౌట్ దృశ్యాలు పంచుకున్న రష్మిక మందన్న.. గాయం తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి భోగి సినిమాపై తీవ్ర విమర్శలు, ట్రోల్స్.. రక్తపాతంపై నెటిజన్ల అసహనం డిసెంబర్ 5 లోపు రేషన్ కార్డు దారులు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. వీధి కుక్కల దాడి - 32 మేక పిల్లలు మృతి మత్తు పదార్థాల నివారణకు పోలీసుల సంయుక్త తనిఖీలు సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ సెమీస్‌లోకి సాత్విక్ రెడ్డి–రేషిక జోడీ

విదేశీ ఉద్యోగాలకు తోడ్పాటు.. రూ.1.75 లక్షల వరకు ఆర్థిక సా

Select Suryaa Now
విదేశీ ఉద్యోగాలకు తోడ్పాటు.. రూ.1.75 లక్షల వరకు ఆర్థిక సా
హైదరాబాద్: విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనుకునే తెలంగాణ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన యువత విదేశీ కొలువుల కలను సాకారం చేసుకునేందుకు వీలుగా 'ముఖ్యమంత్రి ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ స్కీమ్' (CMOES) పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ఆధ్వర్యంలో అమలయ్యే ఈ పథకం ద్వారా 2026–27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 7 వేల మంది యువతకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ పథకం కింద 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండి, ఐటీఐ, పాలిటెక్నిక్ లేదా ఆయా ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన వీసా ఫీజులు, విమాన టికెట్ ఖర్చులు, విదేశీ భాషా శిక్షణ వ్యయాలపై ప్రభుత్వం 50 శాతం రాయితీ అందిస్తుంది. ఇందులో భాగంగా ప్రత్యేక భాషా శిక్షణ అవసరం లేకుండా నేరుగా ఉద్యోగాలు పొందేవారికి రూ. 50 వేల వరకు, విదేశీ భాషా ప్రావీణ్యం అవసరమైన ఉద్యోగాలకు గరిష్టంగా రూ. 1.75 లక్షల వరకు ఆర్థిక సాయం లభిస్తుంది. తమ వాటా ఖర్చులను భరించలేని అభ్యర్థులకు బ్యాంక్ రుణ సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. మొత్తం లబ్ధిదారులలో మహిళలకు 33.33 శాతం, దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయించారు.

విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందిన అభ్యర్థులు తమ పాస్‌పోర్టు, విద్యా ధ్రువీకరణ పత్రాలతో 'టామ్‌కామ్-సీఎంఓఈఎస్' ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను పరిశీలించి 30 రోజుల్లోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. వీసా, ఉద్యోగ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వీసా ఖర్చులలో 50 శాతం సబ్సిడీని, అభ్యర్థి విదేశాలకు చేరుకుని ప్రయాణ పత్రాలు సమర్పించిన తర్వాత విమాన టికెట్ ఖర్చులలో 50 శాతం సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు.