BREAKING
విజయ్ సేతుపతి, మిస్కిన్ కాంబోలో ‘ట్రైన్’ ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 4న థియేటర్లలోకి కంఫర్ట్ జోన్ దాటి విభిన్న పాత్రలే లక్ష్యం.. వృషకర్మ విశేషాలు పంచుకున్న మీనాక్షి చౌదరి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం.... ముగ్గురు ఆడపిల్లలు మృతి ఉత్సవాలకు హాజరుకావాలని ఎంపీకి ఆహ్వానం వచ్చే ఎన్నికలే లక్ష్యం: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్ యాక్షన్ ప్లాన్ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* ఆకాశంలో ఒక తార సక్సెస్.. దుల్కర్ లేకపోతే ఇంత అందమైన సినిమా చూసేవాళ్లం కాదు: రాజమౌళి నోముల–ఆగపల్లి లింక్ రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి బీఆర్‌ఎస్‌ ఇడుపు కాయితం నుంచి ఉల్లిపూల సాంగ్ రిలీజ్.. ప్రియదర్శి, నాగదుర్గ జోడీకి మంచి స్పందన *తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ - 2026 రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషం.* ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవురామ్ దంపతులను కలసిన సర్పంచ్ చెవ్వా శివారెడ్డి విదేశీ ఉద్యోగాలకు తోడ్పాటు.. రూ.1.75 లక్షల వరకు ఆర్థిక సా 48 ఏళ్ల క్రితం ఆ అలవాటు తిరస్కరించా.. అందుకే మెగాస్టార్ అయ్యా: నషా ముక్త్ భారత్ వేదికపై చిరంజీవి ఇంట్లో వర్కౌట్ దృశ్యాలు పంచుకున్న రష్మిక మందన్న.. గాయం తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి భోగి సినిమాపై తీవ్ర విమర్శలు, ట్రోల్స్.. రక్తపాతంపై నెటిజన్ల అసహనం

పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

Select Suryaa Now
పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి*  *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

కర్నూలు, నవంబర్ 28:- జిల్లాలో నవంబర్ 29 వ తేదీన   గ్రామ పంచాయతీ 2వ దశ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల నిబంధనల ప్రకారం పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు..రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై శనివారం కలెక్టర్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు..ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ రోజు ఉదయం 7 గంటలకు  పోలింగ్ ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. ఇందుకోసం పోలింగ్ సిబ్బందికి ఉదయం 6 గంటలకే అల్పాహారం అందించాలని, 6.30 గంటలలోపు అల్పాహారం పూర్తి చేసుకొని విధులకు సిద్ధంగా ఉండాలన్నారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు క్యూలో ఉంటే, క్యూలో చివర ఉన్నవారి నుంచి టోకెన్లు జారీ చేసి, టోకెన్ పొందిన ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పించాలన్నారు. తద్వారా నిర్ణీత సమయానికి ముందే క్యూలో ఉన్న ఓటర్లు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యం కాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రిసైడింగ్ అధికారులకు మధ్యాహ్నం 12.30 గంటలలోపు భోజనం అందించి, వారు భోజనం పూర్తి చేసుకునేలా చూడాలని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లు మధ్యాహ్నం 2 గంటలకల్లా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకునేలా ముందుగానే సమాచారం ఇవ్వాలని, సిబ్బంది లేదా ఏజెంట్ల రాకలో జాప్యం కారణంగా కౌంటింగ్ ఆలస్యం కాకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. మధ్యాహ్నం 2 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు...4 వేలకుపైగా ఓట్లు ఉన్న ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తయ్యేలా అదనపు కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్లు, తగినంత లైటింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.ఓటర్ స్లిప్ ఒక్కటే చూపించి ఓటు వేయడానికి అనుమతించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్నికల సంఘం ఆమోదించిన ఫోటో గుర్తింపు కార్డును చూపించిన తర్వాతే ఓటు వేయడానికి అనుమతించాలని కలెక్టర్ తెలిపారు.. పోలింగ్ కేంద్రాల్లోకి ఒకేసారి ఎక్కువ మంది ఓటర్లను అనుమతించకుండా ఒక్కొక్కరిని మాత్రమే లోపలికి పంపించాలన్నారు.  ఓటు రహస్యతను కాపాడేందుకు ఓటింగ్ కంపార్ట్మెంట్లను కిటికీలకు సమీపంలో ఏర్పాటు చేయరాదని, తప్పనిసరి పరిస్థితుల్లో కిటికీలను పూర్తిగా మూసివేయాలని కలెక్టర్ తెలిపారు.. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో స్టాట్యూటరీ, నాన్-స్టాట్యూటరీ కౌంటర్లు, మైక్ సిస్టం ఏర్పాటు చేయాలని, పోలింగ్ సిబ్బందికి అవసరమైన భోజన సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రిసైడింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్‌తో సహా తమకు అందజేసిన ఎన్నికల సామగ్రిని పూర్తిగా తనిఖీ చేసుకున్న తర్వాతే డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి బయలుదేరాలన్నారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న తర్వాత అక్కడి ఏర్పాట్లు, బ్యాలెట్ బాక్సులు, కవర్లు, ఇతర సామగ్రిని మరోసారి తనిఖీ చేసుకోవాలన్నారు. ఓటర్లు ప్రవేశించే మార్గం, బయటకు వెళ్లే మార్గం, సిబ్బంది విధులు తదితర అంశాలపై ముందుగానే స్పష్టత కలిగి ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.టెలి కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, డిపిఓ భాస్కర్, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, ఆదోని ఆర్డీఓ అరుణ దేవి, ఎంపిడిఓ లు, తహశీల్దార్లు, నోడల్ అధికారులు,స్పెషల్ ఆఫీసర్లు, ఆర్వోలు  పాల్గొన్నారు.