BREAKING
డిసెంబర్ 5 లోపు రేషన్ కార్డు దారులు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. వీధి కుక్కల దాడి - 32 మేక పిల్లలు మృతి మత్తు పదార్థాల నివారణకు పోలీసుల సంయుక్త తనిఖీలు సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ సెమీస్‌లోకి సాత్విక్ రెడ్డి–రేషిక జోడీ శెట్టూరు మండలం యాటకలలో బ్యాలెట్ పేపర్ల కలకలం.. కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ శ్రేణుల దౌర్జన్యం.. ఆర్వో ఏకపక్ష వైఖరిపై బాధితుల ఆగ్రహం ప్రజల సమస్యలపై సర్పంచ్ స్పందన ఏది? పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ ఎక్కడ? కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు జ్యోతిబా పూలే: జాజుల లింగంగౌడ్ *పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు* ఓటర్ స్లిప్ ఉన్నా లేకపోయినా సరే, కానీ 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉండాల్సిందే!* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* అహోబిలం ఘటనలో గాయపడిన ఆమె మృతి చెందలేదు. వదంతులు నమ్మవద్దు. డీఎస్పీ రవికుమార్ అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అహోబిలం ఘటనలో గాయపడిన మహిళ మృతి చెందలేదు. వదంతులు నమ్మవద్దు రవికుమార్ ఇంటర్ స్కూల్ క్రీడా పోటీల్లో నోబుల్ హై స్కూల్ విద్యార్థులకు పతకాల పంట అనంతపురం అర్బన్ బ్యాంక్ పాలకవర్గ సభ్యత్వానికి సుంకర రమేష్ రాజీనామా సుగుణ ఐరన్ ఫ్యాక్టరీలో పోలీసుల సైలెంట్ ఆపరేషన్.. 12 మందికి డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్‌

శెట్టూరు మండలం యాటకలలో బ్యాలెట్ పేపర్ల కలకలం..

Select Suryaa Now
శెట్టూరు మండలం యాటకలలో బ్యాలెట్ పేపర్ల కలకలం..

 కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం యాటకల్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. నవంబర్ 26న పోలింగ్ అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత 160కి పైగా బ్యాలెట్ పేపర్లు కౌంటింగ్ గదిలో లభ్యమైనట్లు వైసీపీ వర్గాలు ఆరోపించడంతో గ్రామంలో కలకలం రేగింది. వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సి.వరలక్ష్మికి కేటాయించిన కత్తెర గుర్తుపై ముద్రించిన ఓట్లతో కూడిన బ్యాలెట్ పత్రాలు కనిపించాయని అభ్యర్థి తరఫు వారు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఆ బ్యాలెట్ పత్రాలపై ఎన్నికల అధికారులు ముద్రించిన గుర్తులు, రిటర్నింగ్ అధికారి సంతకం, అధికారిక ముద్ర ఉన్నాయని ఆరోపిస్తున్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ బ్యాలెట్ పత్రాలు కౌంటింగ్ గదిలోకి ఎలా వచ్చాయి? వాటిని ఓట్ల లెక్కింపులో పరిగణనలోకి తీసుకున్నారా? అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి సి.వరలక్ష్మి రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, లభ్యమైనట్లు చెబుతున్న బ్యాలెట్ పత్రాలపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని కోరుతున్నారు. బ్యాలెట్ పత్రాల ప్రామాణికత, వాటి చెల్లుబాటు, కౌంటింగ్‌లో జరిగిన పరిణామాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు, మేధావులు కోరుతున్నారు. అయితే బ్యాలెట్ పత్రాల లభ్యత, సంఖ్య, వాటి చెల్లుబాటు వంటి అంశాలపై అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది.