BREAKING
కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ శ్రేణుల దౌర్జన్యం.. ఆర్వో ఏకపక్ష వైఖరిపై బాధితుల ఆగ్రహం ప్రజల సమస్యలపై సర్పంచ్ స్పందన ఏది? పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ ఎక్కడ? కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు జ్యోతిబా పూలే: జాజుల లింగంగౌడ్ *పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు* ఓటర్ స్లిప్ ఉన్నా లేకపోయినా సరే, కానీ 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉండాల్సిందే!* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* అహోబిలం ఘటనలో గాయపడిన ఆమె మృతి చెందలేదు. వదంతులు నమ్మవద్దు. డీఎస్పీ రవికుమార్ అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అహోబిలం ఘటనలో గాయపడిన మహిళ మృతి చెందలేదు. వదంతులు నమ్మవద్దు రవికుమార్ ఇంటర్ స్కూల్ క్రీడా పోటీల్లో నోబుల్ హై స్కూల్ విద్యార్థులకు పతకాల పంట అనంతపురం అర్బన్ బ్యాంక్ పాలకవర్గ సభ్యత్వానికి సుంకర రమేష్ రాజీనామా సుగుణ ఐరన్ ఫ్యాక్టరీలో పోలీసుల సైలెంట్ ఆపరేషన్.. 12 మందికి డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్‌ సి ఏం ఆర్ ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణి చేసిన బీజేపీ మండలం నాయకులు రెండో విడత ఎన్నికలకు పటిష్ట భద్రత : ఎస్పీ అజ్మీర్ దర్గాలో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ ప్రత్యేక ప్రార్థనలు ఫూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి *మిర్యాలగూడలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి* టిఎస్ఆర్టిసి నిర్మల్ డిపో ఈ నెల 29న డయల్ యువర్ డీఎం కార్యక్రమం. :

ఓటర్ స్లిప్ ఉన్నా లేకపోయినా సరే, కానీ 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉండాల్సిందే!* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

Select Suryaa Now
ఓటర్ స్లిప్ ఉన్నా లేకపోయినా సరే,  కానీ 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉండాల్సిందే!*  *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

కర్నూలు, నవంబర్ 28: ఓటర్ స్లిప్ ఉన్నా లేకపోయినా సరే,  కానీ ఎలెక్టోరల్ ఫోటో ఐడి కార్డు లేదా  20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉండాల్సిందే అని, ఈ నెల 29 వ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ సందర్భంగా  ఎన్నికల సంఘం సూచించిన క్రింది 20 రకాల ఫొటో గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని పోలింగ్ కేంద్రంలో చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఏ.సిరి  శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పాన్ కార్డు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ లిమిటెడ్ కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు, ఫొటోతో కూడిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్, మాజీ సైనికుల పెన్షన్ పుస్తకం, వృద్ధాప్య, వితంతు పెన్షన్ పత్రాలు, ఫొటోతో కూడిన పట్టాదారు పాస్‌బుక్‌లు, రిజిస్టర్డ్ ఆస్తి పత్రాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, పోస్టాఫీసులు, APCOB, DCCBలు జారీ చేసిన ఫొటో పాస్‌బుక్‌లు, కిసాన్ పాస్‌బుక్‌లు, బ్యాంకులు జారీ చేసిన ఫొటోతో కూడిన ఏటీఎం కార్డులు, ఫొటోతో కూడిన రేషన్ కార్డులు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) కింద RGI జారీ చేసిన స్మార్ట్ కార్డులు, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, సంబంధిత అధికార సంస్థ జారీ చేసిన ఫొటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ధ్రువీకరణ పత్రాలు, ఫొటోతో కూడిన స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపు కార్డులు, ఫొటోతో కూడిన ఆయుధ లైసెన్సులు, సంబంధిత అధికారి జారీ చేసిన ఫొటోతో కూడిన దివ్యాంగ ధ్రువీకరణ పత్రం, బార్ కౌన్సిళ్లు జారీ చేసిన ఫొటోతో కూడిన సభ్యత్వ కార్డులు, కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద జారీ చేసిన ఫొటోతో కూడిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శాసనసభ, శాసనమండలి సచివాలయాలు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు, ఎంపీలకు లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.