అహోబిలం ఘటనలో గాయపడిన ఆమె మృతి చెందలేదు. వదంతులు నమ్మవద్దు. డీఎస్పీ రవికుమార్
అహోబిలం ఘటనలో గాయపడిన మహిళ మృతి చెందలేదు
*వదంతులు నమ్మవద్దు
*డిఎస్పి రవికుమార్
ఆళ్లగడ్డ, మేజర్ న్యూస్; అహోబిలం ఘటనలో గాయపడిన మహిళ మృతి చెందలేదని ప్రస్తుతం మరణించిన ఆమె ఈమె కాదని వదంతులు నమ్మవద్దని డిఎస్పి రవికుమార్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ అహోబిలం దుర్ఘటనలో జె.లక్ష్మి దేవి, జి .లక్ష్మీదేవి, రమణమ్మ లు అనే మహిళలు గాయపడ్డారని వారు ఉదయానంద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే రాములయ్య అనే వ్యక్తి కడప వేదాంత హాస్పిటల్ లో చికిత్స చేయించుకోవడం జరుగుతుందన్నారు. కానీ కర్నూలు అమృత హాస్పిటల్ లో మరణించిన నాగలక్ష్మి అనే మహిళ అహోబిలo వాసి అని , అహోబిలం ఘటనలో గాయపడిన మహిళలలో ఆమె లేదన్నారు. ఈమె గత కొద్ది సంవత్సరాల నుండి నరస రామ్ అనే నరాల వైద్యుని దగ్గర పెరాలసిస్ రోగానికి చికిత్స తీసుకోవడం జరుగుతుందన్నారు. రెండు రోజుల క్రితం ఆమె ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కు వెళ్లడం జరిగింది అన్నారు.శుక్రవారం రాత్రి నాగలక్ష్మి మరణించడం జరిగింది అన్నారు. అహోబిలం ఘటనలో గాయపడిన ఆమె ఆరోగ్యకరంగా ఉందని, మరణించలేదని మీరు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని డిఎస్పి రవికుమార్ తెలిపారు. మృతి చెందిన మహిళ డి.నాగలక్ష్మి మరణంపై అనుమానాలు ఉంటే తమకు ఫిర్యాదు చేయవచ్చని వారి కుటుంబ సభ్యులను ఆయన కోరారు. తప్పుడు ప్రచారం చేస్తే చట్టరీత్యాచర్యలు తీసుకుంటామని డి.ఎస్.పి హెచ్చరించారు.
శ్రీనివాస్ , ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా.