BREAKING
కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ శ్రేణుల దౌర్జన్యం.. ఆర్వో ఏకపక్ష వైఖరిపై బాధితుల ఆగ్రహం ప్రజల సమస్యలపై సర్పంచ్ స్పందన ఏది? పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ ఎక్కడ? కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు జ్యోతిబా పూలే: జాజుల లింగంగౌడ్ *పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు* ఓటర్ స్లిప్ ఉన్నా లేకపోయినా సరే, కానీ 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉండాల్సిందే!* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* అహోబిలం ఘటనలో గాయపడిన ఆమె మృతి చెందలేదు. వదంతులు నమ్మవద్దు. డీఎస్పీ రవికుమార్ అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అహోబిలం ఘటనలో గాయపడిన మహిళ మృతి చెందలేదు. వదంతులు నమ్మవద్దు రవికుమార్ ఇంటర్ స్కూల్ క్రీడా పోటీల్లో నోబుల్ హై స్కూల్ విద్యార్థులకు పతకాల పంట అనంతపురం అర్బన్ బ్యాంక్ పాలకవర్గ సభ్యత్వానికి సుంకర రమేష్ రాజీనామా సుగుణ ఐరన్ ఫ్యాక్టరీలో పోలీసుల సైలెంట్ ఆపరేషన్.. 12 మందికి డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్‌ సి ఏం ఆర్ ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణి చేసిన బీజేపీ మండలం నాయకులు రెండో విడత ఎన్నికలకు పటిష్ట భద్రత : ఎస్పీ అజ్మీర్ దర్గాలో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ ప్రత్యేక ప్రార్థనలు ఫూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి *మిర్యాలగూడలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి* టిఎస్ఆర్టిసి నిర్మల్ డిపో ఈ నెల 29న డయల్ యువర్ డీఎం కార్యక్రమం. :

ఇంటర్ స్కూల్ క్రీడా పోటీల్లో నోబుల్ హై స్కూల్ విద్యార్థులకు పతకాల పంట

Select Suryaa Now
ఇంటర్ స్కూల్ క్రీడా పోటీల్లో నోబుల్ హై స్కూల్ విద్యార్థులకు పతకాల పంట

 

కందుకూరు, మేజర్ న్యూస్: హైదరాబాద్‌లో నిర్వహించిన 6వ ఎడిషన్ ఇంటర్ స్కూల్ క్రీడా పోటీల్లో కందుకూరు మండలంలోని నోబుల్ హై స్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు.
షైన్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నవంబర్ 22 నుంచి 27 వరకు కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, కులీ కుతుబ్ షా స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీల్లో అండర్-10, అండర్-12, అండర్-14, అండర్-16, అండర్-17 విభాగాల్లో విద్యార్థులు వివిధ క్రీడాంశాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.

*వివిధ క్రీడల్లో పతకాలు*

స్కేటింగ్‌లో నాలుగో తరగతి విద్యార్థి టీ. ధృవ బంగారు పతకం సాధించగా, ఐదో తరగతి విద్యార్థి ఎం.డి. అయాన్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అండర్-17 వాలీబాల్ పోటీల్లో నోబుల్ హై స్కూల్‌కు చెందిన ఒక జట్టు బంగారు పతకం, మరో జట్టు వెండి పతకం సాధించింది. ఖో-ఖో, కబడ్డీ అండర్-17 విభాగాల్లో పాఠశాల జట్లు కాంస్య పతకాలు గెలుచుకున్నాయి.
విద్యార్థుల విజయాలపై పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తూ విజేతలను అభినందించింది. పాఠశాల కరస్పాండెంట్ బైరు కొండల్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఎం. సంపత్ రెడ్డి, బైరు లావణ్య కొండల్ రెడ్డి, ఇన్‌ఛార్జ్ బి. రాంచంద్రా రెడ్డి, మంజుల, పీఈటీ నరేష్ రామ్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, పట్టుదల, జట్టు స్ఫూర్తిని పెంపొందించడమే పాఠశాల లక్ష్యమని కరస్పాండెంట్ బైరు కొండల్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్ కందుకూరు, రంగారెడ్డి జిల్లా.