BREAKING
శెట్టూరు మండలం యాటకలలో బ్యాలెట్ పేపర్ల కలకలం.. కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ శ్రేణుల దౌర్జన్యం.. ఆర్వో ఏకపక్ష వైఖరిపై బాధితుల ఆగ్రహం ప్రజల సమస్యలపై సర్పంచ్ స్పందన ఏది? పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ ఎక్కడ? కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు జ్యోతిబా పూలే: జాజుల లింగంగౌడ్ *పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు* ఓటర్ స్లిప్ ఉన్నా లేకపోయినా సరే, కానీ 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉండాల్సిందే!* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* అహోబిలం ఘటనలో గాయపడిన ఆమె మృతి చెందలేదు. వదంతులు నమ్మవద్దు. డీఎస్పీ రవికుమార్ అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అహోబిలం ఘటనలో గాయపడిన మహిళ మృతి చెందలేదు. వదంతులు నమ్మవద్దు రవికుమార్ ఇంటర్ స్కూల్ క్రీడా పోటీల్లో నోబుల్ హై స్కూల్ విద్యార్థులకు పతకాల పంట అనంతపురం అర్బన్ బ్యాంక్ పాలకవర్గ సభ్యత్వానికి సుంకర రమేష్ రాజీనామా సుగుణ ఐరన్ ఫ్యాక్టరీలో పోలీసుల సైలెంట్ ఆపరేషన్.. 12 మందికి డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్‌ సి ఏం ఆర్ ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణి చేసిన బీజేపీ మండలం నాయకులు రెండో విడత ఎన్నికలకు పటిష్ట భద్రత : ఎస్పీ అజ్మీర్ దర్గాలో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ ప్రత్యేక ప్రార్థనలు ఫూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి *మిర్యాలగూడలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి*

కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ శ్రేణుల దౌర్జన్యం.. ఆర్వో ఏకపక్ష వైఖరిపై బాధితుల ఆగ్రహం

Select Suryaa Now
కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ శ్రేణుల దౌర్జన్యం.. ఆర్వో ఏకపక్ష వైఖరిపై బాధితుల ఆగ్రహం

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : ​కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ శ్రేణులు అరాచకం సృష్టించాయని, రిటర్నింగ్ అధికారి (ఆర్వో) వారికి వత్తాసు పలికి తమను అన్యాయంగా ఓడించారని బాధిత అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు అని కూడా చూడకుండా తమపై దాడి చేసి, తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని వారు ఆరోపించారు.

​ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రంలోకి కేవలం వైసీపీ కార్యకర్తలను మాత్రమే అనుమతించి, టీడీపీ వారిని బయటకు పంపేశారని తెలిపారు. సుమారు 500 మంది రాళ్లు, కర్రలతో గోడలు దూకి వచ్చి, తలుపులు పగలగొట్టే ప్రయత్నం చేసినా పోలీసులు కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. మహిళలని కూడా చూడకుండా కాళ్లతో తన్ని చంపేందుకు ప్రయత్నించారని, ఇనుప తలుపులు ఉండటం వల్ల తాము ప్రాణాలతో బయటపడగలిగామని పేర్కొన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు వచ్చామని వారు ఆవేదన చెందారు.

​రీకౌంటింగ్ నిర్వహించాలని కోరినందుకు ఆర్వో తమ పట్ల అసభ్యంగా, నిర్లక్ష్యంగా ప్రవర్తించారని బాధితులు ఆరోపించారు. తనకు నడుము నొప్పిగా ఉందని, రీకౌంటింగ్ చేయలేనని చెప్పడమే కాకుండా, తమతో తెల్ల కాగితాలపై (వైట్ పేపర్లు) బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. తాము ఎంత బతిమిలాడినా కనికరం చూపకుండా వైసీపీకి మద్దతుగా నిలిచి తమ ఓటమికి కారణమయ్యారని మండిపడ్డారు.

​మరోవైపు, మహిళా అభ్యర్థిపై జరిగిన దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తూ మాట్లాడిన ఎమ్మెల్యేపై వైసీపీ శ్రేణులు ఏఐ (AI) వీడియోలు సృష్టించి, తప్పుడు ప్రచారంతో అభాసుపాలు చేయాలని చూస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.