ఫూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి *మిర్యాలగూడలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి*
ఫూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
*మిర్యాలగూడలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి*
మిర్యాలగూడ అర్బన్,మేజర్ న్యూస్ : మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో ఘనంగా నివాళులర్పించారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫూలే చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని ఫూలే విగ్రహాలకు పూలమాలలు వేసి, పాలతో పాదాలను శుద్ధి చేసి గౌరవాభిమానాలు చాటుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజంలో సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్‌పర్సన్ గుడిపాటి శిరీష నవీన్, పట్టణ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.