BREAKING
చీరాలలో రైలు ఢీ కొని గుర్తుతెలియని వ్యక్తి మృతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతా బ్రిటన్‌లోని ఆర్ఏఎఫ్ స్థావరం వద్ద డ్రోన్ల కలకలం కేసీఆర్ పేరుతో రూ.3 లక్షల బంగారు ఉంగరం చేయించుకున్న అభిమాని ప్రాక్సీ పోరులో వెయిల్ రిసార్ట్స్ బోర్డుకు గ్లాస్ లూయిస్ మద్దతు ప్రపంచవ్యాప్తంగా తగ్గిన మీజిల్స్ మరణాలు వాణిజ్య రహస్యాల చోరీ, సరఫరాదారులపై ఒత్తిడి ఆరోపణలు రిచ్‌మండ్ అనుబంధ సంస్థకు ఇటలీ కోర్టు షాక్ యూకే ఈయూ ఉద్గారాల ఒప్పందంపై బ్రిటన్ ఉక్కు పరిశ్రమ ఆందోళన చైనాలో ప్రీమియం పఫర్ జాకెట్ల ధోరణికి ఎదురుదెబ్బ 30వ తేదీ శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలు ఓట్లు లెక్కింపు అమెరికా బ్లాక్ ఫ్రైడే ఆన్‌లైన్ అమ్మకాలు 13 బిలియన్ డాలర్లు దాటే అవకాశం బిస్లేరి నీటి నమూనాలో బ్యాక్టీరియా.. సంస్థపై ఎఫ్ఎస్ఎస్ఏఐ మరోసారి చర్యలు ఏపీలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు పాఠశాల ముందు బురదమయం

కేసీఆర్ పేరుతో రూ.3 లక్షల బంగారు ఉంగరం చేయించుకున్న అభిమాని

Select Suryaa Now
కేసీఆర్ పేరుతో రూ.3 లక్షల బంగారు ఉంగరం చేయించుకున్న అభిమాని

 


యాచారం, మేజర్ న్యూస్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై ఉన్న అభిమానాన్ని ఓ వీరాభిమాని వినూత్నంగా చాటుకున్నారు. యాచారం మండల పరిధిలోని తమలోని గూడ గ్రామానికి చెందిన బాలం రాములు, కేసీఆర్ పేరుతో మూడు లక్షల రూపాయల విలువైన బంగారు ఉంగరాన్ని చేయించుకుని తన అభిమానాన్ని చాటుకున్నారు.
బాలం రాములు బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడిగా కొనసాగుతూ కేసీఆర్‌కు వీరాభిమాని. కేసీఆర్ అనే మూడు అక్షరాలతో ప్రత్యేకంగా బంగారు ఉంగరాన్ని తయారు చేయించుకుని ధరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఆయనతో ఫొటో దిగాలన్నది తన చిరకాల కోరిక అని రాములు తెలిపారు.
అయితే యాచారం మండల బీఆర్‌ఎస్ నాయకులు తనను పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్పందించి తన కోరిక నెరవేర్చేందుకు సహకరించాలని కోరారు. కేసీఆర్‌పై తనకున్న అభిమానాన్ని ఉంగరం ద్వారా చాటుకుంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.

కొండ్రు శివ, మేజర్ న్యూస్, యాచారం, రంగారెడ్డి జిల్లా