BREAKING
రిచ్‌మండ్ అనుబంధ సంస్థకు ఇటలీ కోర్టు షాక్ యూకే ఈయూ ఉద్గారాల ఒప్పందంపై బ్రిటన్ ఉక్కు పరిశ్రమ ఆందోళన చైనాలో ప్రీమియం పఫర్ జాకెట్ల ధోరణికి ఎదురుదెబ్బ 30వ తేదీ శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలు ఓట్లు లెక్కింపు అమెరికా బ్లాక్ ఫ్రైడే ఆన్‌లైన్ అమ్మకాలు 13 బిలియన్ డాలర్లు దాటే అవకాశం బిస్లేరి నీటి నమూనాలో బ్యాక్టీరియా.. సంస్థపై ఎఫ్ఎస్ఎస్ఏఐ మరోసారి చర్యలు ఏపీలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు పాఠశాల ముందు బురదమయం తైవాన్ స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం డాక్యుమెంటరీలో బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ భావోద్వేగ ప్రయాణం జనవరి ఆరంభంలో షిప్పింగ్ ఆసక్తి పరిశీలనకు కసరత్తు కడియం శ్రీహరి వ్యవహారంపై నేడు ఎథిక్స్‌ కమిటీ భేటీ ఇఫీ 2026లో పోర్చుగీస్ చిత్రం కమ్ విత్ మీ ప్రదర్శన దేశ కథా సంప్రదాయాలు, భారతీయ సినిమా వైభవంపై ప్రత్యేక చర్చ ప్రతిష్టాత్మక ఐటీయూ ప్లెనిపొటెన్షియరీ కాన్ఫరెన్స్ 2030కు భారత్ ఆతిథ్యం

ఏపీలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు

Select Suryaa Now
ఏపీలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు

అమరావతి, నవంబరు 28: ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం (నవంబరు 29) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 52 రెవెన్యూ డివిజన్లు, 246 మండలాల పరిధిలోని మొత్తం 4,975 సర్పంచ్‌ స్థానాలకు నోటిఫికేషన్‌ జారీ కాగా, ఇందులో 1,171 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా తిరుపతి జిల్లాలో 136 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక్క స్థానం కూడా ఏకగ్రీవం కాలేదు. పోలవరం ప్రాంతంలో ఒక సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ దాఖలు కాకపోవడంతో, మిగిలిన 3,803 సర్పంచ్‌ స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల కోసం మొత్తం 10,292 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

మరోవైపు వార్డు సభ్యుల స్థానాల్లోనూ భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు నమోదయ్యాయి. రెండో విడతలో మొత్తం 19,651 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా, 59 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 29,608 వార్డు స్థానాలకు 63,410 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్‌ ముగిసిన అనంతరం, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించి ఫలితాలను వెల్లడించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్‌ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.