BREAKING
చైనాలో ప్రీమియం పఫర్ జాకెట్ల ధోరణికి ఎదురుదెబ్బ 30వ తేదీ శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలు ఓట్లు లెక్కింపు అమెరికా బ్లాక్ ఫ్రైడే ఆన్‌లైన్ అమ్మకాలు 13 బిలియన్ డాలర్లు దాటే అవకాశం బిస్లేరి నీటి నమూనాలో బ్యాక్టీరియా.. సంస్థపై ఎఫ్ఎస్ఎస్ఏఐ మరోసారి చర్యలు ఏపీలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు పాఠశాల ముందు బురదమయం తైవాన్ స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం డాక్యుమెంటరీలో బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ భావోద్వేగ ప్రయాణం జనవరి ఆరంభంలో షిప్పింగ్ ఆసక్తి పరిశీలనకు కసరత్తు కడియం శ్రీహరి వ్యవహారంపై నేడు ఎథిక్స్‌ కమిటీ భేటీ ఇఫీ 2026లో పోర్చుగీస్ చిత్రం కమ్ విత్ మీ ప్రదర్శన దేశ కథా సంప్రదాయాలు, భారతీయ సినిమా వైభవంపై ప్రత్యేక చర్చ ప్రతిష్టాత్మక ఐటీయూ ప్లెనిపొటెన్షియరీ కాన్ఫరెన్స్ 2030కు భారత్ ఆతిథ్యం వారణాసిలో నేడు కాశీ తమిళ సంగమం 5.0 ప్రారంభోత్సవం మాటలు చెప్పడానికి కాదు.. అభివృద్ధి చేసి చూపించడానికి వచ్చా: ప్రవీణ్ రెడ్డి! కోడిగేనహళ్లిని నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే నాలక్ష్యం.. పదవి కోసం కాదు.. పుట్టి పెరిగిన గడ్డకు సేవ చేయడానికే పోటీ.. శనివారం సుబ్బరాయునిపల్లి కాలువపల్లిలో విస్తృత ప్రచారం

తైవాన్ స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Select Suryaa Now
తైవాన్ స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం

సూర్య అంతర్జాతీయ డెస్క్: తైవాన్‌లోని 22 నగరాలు, కౌంటీల పరిధిలో మేయర్లు, కౌంటీ అధిపతులు సహా ఇతర స్థానిక పదవులకు శనివారం పోలింగ్ ప్రారంభమైంది. రవాణా, పర్యావరణం, స్థానిక పాలన వంటి అంశాల చుట్టూ ఎన్నికల ప్రచారం సాగినప్పటికీ, చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తతలు, బీజింగ్ సైనిక ఒత్తిడి నేపథ్యంలో ఈ ఎన్నికలు అంతర్జాతీయంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగియనుండగా, అదే రోజు రాత్రి తొలి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 2028 అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రధాన రాజకీయ పార్టీల బలాబలాలను అంచనా వేసే కీలక పరీక్షగా ఈ పోరును విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ ఎన్నికల ఫలితాలు తైవాన్ చైనా విధానంపై నేరుగా ప్రభావం చూపకపోయినా, బీజింగ్ మాత్రం ఈ ప్రక్రియపై తీవ్రంగా స్పందిస్తూ తన వ్యూహాత్మక ఒత్తిడిని కొనసాగిస్తోంది. తైవాన్‌ను తమ భూభాగంగా భావించే చైనా, ద్వీపం చుట్టూ యుద్ధ విమానాల కదలికలను పెంచడంతో పాటు, అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ తరఫున రాజధాని తైపీ మేయర్ పదవికి పోటీ చేస్తున్న పుమా షెన్‌ను ప్రభుత్వ మీడియా ద్వారా తీవ్రంగా తూర్పారబట్టింది. వేర్పాటువాద ఆరోపణలపై చైనా పోలీసులు వాంటెడ్ జాబితాలో చేర్చిన పుమా షెన్ ఎన్నికల బరిలో నిలవడం చైనా ఆగ్రహానికి కారణమైంది.

మరోవైపు ఎన్నికల వ్యవస్థపై అవిశ్వాసం పెంచేందుకు, తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చైనా కృత్రిమ మేధ సాంకేతికతను ఉపయోగిస్తోందని తైవాన్ మెయిన్‌ల్యాండ్ అఫైర్స్ కౌన్సిల్ ఇప్పటికే హెచ్చరించింది. సామాజిక మాధ్యమాలలో నకిలీ ఖాతాల సృష్టి, డిజిటల్ జోక్యాల పట్ల ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈసారి పోలింగ్‌లో స్థానిక నేతల ఎన్నికలతో పాటు 2025లో చివరి అణు రియాక్టర్ మూసివేత అనంతరం తలెత్తిన ఇంధన భద్రతా చర్చల నేపథ్యంలో అణు విద్యుత్‌కు సంబంధించిన రిఫరెండంపై కూడా ఓటర్లు తమ నిర్ణయాన్ని తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం 22 నగరాలు, కౌంటీలలో ప్రతిపక్ష కోమింటాంగ్ పార్టీ 14 స్థానాలను పాలిస్తుండగా, అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఐదు స్థానాలలో అధికారంలో ఉంది. రాజధాని తైపీలో మేయర్ పదవి కోసం పుమా షెన్, ప్రస్తుత మేయర్ చియాంగ్ వాన్-ఆన్ మధ్య హోరాహోరీ పోరు నెలకొనగా, దక్షిణ ప్రాంతంలోని కీలక ఓడరేవు నగరం కావోసింగ్‌లో పట్టు నిలుపుకునేందుకు అధికార పార్టీ, పాగా వేసేందుకు ప్రతిపక్షం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. నాలుగేళ్ల పదవీకాలం కోసం జరుగుతున్న ఈ స్థానిక ఎన్నికలు తైవాన్ అంతర్గత రాజకీయ సమీకరణలతో పాటు ప్రాంతీయ భద్రతా వాతావరణంపైనా కీలక ప్రభావం చూపనున్నాయి.