BREAKING
కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ శ్రేణుల దౌర్జన్యం.. ఆర్వో ఏకపక్ష వైఖరిపై బాధితుల ఆగ్రహం ప్రజల సమస్యలపై సర్పంచ్ స్పందన ఏది? పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ ఎక్కడ? కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు జ్యోతిబా పూలే: జాజుల లింగంగౌడ్ *పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు* ఓటర్ స్లిప్ ఉన్నా లేకపోయినా సరే, కానీ 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉండాల్సిందే!* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* అహోబిలం ఘటనలో గాయపడిన ఆమె మృతి చెందలేదు. వదంతులు నమ్మవద్దు. డీఎస్పీ రవికుమార్ అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అహోబిలం ఘటనలో గాయపడిన మహిళ మృతి చెందలేదు. వదంతులు నమ్మవద్దు రవికుమార్ ఇంటర్ స్కూల్ క్రీడా పోటీల్లో నోబుల్ హై స్కూల్ విద్యార్థులకు పతకాల పంట అనంతపురం అర్బన్ బ్యాంక్ పాలకవర్గ సభ్యత్వానికి సుంకర రమేష్ రాజీనామా సుగుణ ఐరన్ ఫ్యాక్టరీలో పోలీసుల సైలెంట్ ఆపరేషన్.. 12 మందికి డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్‌ సి ఏం ఆర్ ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణి చేసిన బీజేపీ మండలం నాయకులు రెండో విడత ఎన్నికలకు పటిష్ట భద్రత : ఎస్పీ అజ్మీర్ దర్గాలో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ ప్రత్యేక ప్రార్థనలు ఫూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి *మిర్యాలగూడలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి* టిఎస్ఆర్టిసి నిర్మల్ డిపో ఈ నెల 29న డయల్ యువర్ డీఎం కార్యక్రమం. :

అహోబిలం ఘటనలో గాయపడిన మహిళ మృతి చెందలేదు. వదంతులు నమ్మవద్దు రవికుమార్

Select Suryaa Now
అహోబిలం ఘటనలో గాయపడిన మహిళ మృతి చెందలేదు. వదంతులు నమ్మవద్దు రవికుమార్

అహోబిలం ఘటనలో గాయపడిన మహిళ మృతి చెందలేదు

*వదంతులు నమ్మవద్దు

*డిఎస్పి రవికుమార్

ఆళ్లగడ్డ, మేజర్ న్యూస్; అహోబిలం ఘటనలో గాయపడిన మహిళ మృతి చెందలేదని ప్రస్తుతం మరణించిన ఆమె ఈమె కాదని వదంతులు నమ్మవద్దని డిఎస్పి రవికుమార్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ అహోబిలం దుర్ఘటనలో   జె.లక్ష్మి దేవి, జి .లక్ష్మీదేవి, రమణమ్మ లు అనే మహిళలు గాయపడ్డారని వారు ఉదయానంద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే  రాములయ్య అనే వ్యక్తి కడప వేదాంత హాస్పిటల్ లో చికిత్స చేయించుకోవడం జరుగుతుందన్నారు. కానీ  కర్నూలు అమృత హాస్పిటల్ లో మరణించిన నాగలక్ష్మి అనే మహిళ అహోబిలo వాసి అని , అహోబిలం ఘటనలో గాయపడిన మహిళలలో ఆమె లేదన్నారు. ఈమె గత కొద్ది సంవత్సరాల నుండి నరస రామ్ అనే నరాల వైద్యుని దగ్గర పెరాలసిస్ రోగానికి చికిత్స తీసుకోవడం జరుగుతుందన్నారు. రెండు రోజుల క్రితం ఆమె ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కు వెళ్లడం జరిగింది అన్నారు.శుక్రవారం రాత్రి ఆమె బ్రెయిన్ డెడ్ అయి మరణించడం జరిగింది అన్నారు. అహోబిలం ఘటనలో గాయపడిన ఆమె ఆరోగ్యకరంగా ఉందని, మరణించలేదని మీరు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని డిఎస్పి రవికుమార్ తెలిపారు. మృతి చెందిన మహిళ డి.నాగలక్ష్మి మరణంపై అనుమానాలు ఉంటే తమకు ఫిర్యాదు చేయవచ్చని వారి కుటుంబ సభ్యులను ఆయన కోరారు. తప్పుడు ప్రచారం చేస్తే చట్టరీత్యాచర్యలు తీసుకుంటామని డి.ఎస్.పి హెచ్చరించారు.

శ్రీనివాస్ , ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా.