BREAKING
భోగి సినిమాపై తీవ్ర విమర్శలు, ట్రోల్స్.. రక్తపాతంపై నెటిజన్ల అసహనం డిసెంబర్ 5 లోపు రేషన్ కార్డు దారులు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. వీధి కుక్కల దాడి - 32 మేక పిల్లలు మృతి మత్తు పదార్థాల నివారణకు పోలీసుల సంయుక్త తనిఖీలు సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ సెమీస్‌లోకి సాత్విక్ రెడ్డి–రేషిక జోడీ శెట్టూరు మండలం యాటకలలో బ్యాలెట్ పేపర్ల కలకలం.. కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ శ్రేణుల దౌర్జన్యం.. ఆర్వో ఏకపక్ష వైఖరిపై బాధితుల ఆగ్రహం ప్రజల సమస్యలపై సర్పంచ్ స్పందన ఏది? పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ ఎక్కడ? కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు జ్యోతిబా పూలే: జాజుల లింగంగౌడ్ *పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు* ఓటర్ స్లిప్ ఉన్నా లేకపోయినా సరే, కానీ 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉండాల్సిందే!* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* అహోబిలం ఘటనలో గాయపడిన ఆమె మృతి చెందలేదు. వదంతులు నమ్మవద్దు. డీఎస్పీ రవికుమార్ అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అహోబిలం ఘటనలో గాయపడిన మహిళ మృతి చెందలేదు. వదంతులు నమ్మవద్దు రవికుమార్ ఇంటర్ స్కూల్ క్రీడా పోటీల్లో నోబుల్ హై స్కూల్ విద్యార్థులకు పతకాల పంట అనంతపురం అర్బన్ బ్యాంక్ పాలకవర్గ సభ్యత్వానికి సుంకర రమేష్ రాజీనామా

సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ సెమీస్‌లోకి సాత్విక్ రెడ్డి–రేషిక జోడీ

Select Suryaa Now
సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ సెమీస్‌లోకి సాత్విక్ రెడ్డి–రేషిక జోడీ

సూర్య స్పోర్ట్స్ డెస్క్: సయ్యద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత జోడీ సాత్విక్ రెడ్డి కనపురం, రేషిక ఉదయసూరియన్ సెమీఫైనల్‌లోకి ప్రవేశించారు. లక్నోలో జరుగుతున్న ఈ టోర్నీ క్వార్టర్‌ఫైనల్ పోరులో స్వదేశీ జోడీ విరాజ్ కువాలే, రుతపర్ణ పాండాపై 21-8, 21-14 తేడాతో వరుస గేమ్‌లలో స్పష్టమైన విజయం సాధించి ముందంజ వేశారు.

అంతకుముందు రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ఆయుష్ మఖిజా, అనఘ అరవింద పై జంటపై మూడు గేమ్‌ల పోరాటంలో నెగ్గిన సాత్విక్ రెడ్డి, రేషిక ద్వయం, క్వార్టర్స్‌లో దూకుడుగా ఆడుతూ ఆధిపత్యం ప్రదర్శించింది. సెమీఫైనల్ పోరులో ఈ జోడీ మలేషియాకు చెందిన వీ యీ హెర్న్, వాన్నీ గోబీ జంటతో తలపడనుంది. టాప్ సీడ్స్ ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టోను ఓడించి సెమీస్ చేరిన మలేషియా జోడీతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

ఈ టోర్నీలో మిక్స్‌డ్ డబుల్స్‌తో పాటు ఇతర విభాగాలలోనూ భారత షట్లర్లు పోటీలో నిలిచారు. మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా, తన్వి శర్మ సెమీఫైనల్‌కు చేరుకోగా, మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ జోడీ కూడా సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది.

సెమీఫైనల్ మ్యాచ్‌లో మలేషియా జోడీని అధిగమించి ఫైనల్‌కు చేరాలని సాత్విక్ రెడ్డి, రేషిక ద్వయం లక్ష్యంగా పెట్టుకుంది. స్వదేశీ అభిమానుల సమక్షంలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత జోడీ ప్రదర్శనపై క్రీడా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.