BREAKING
విజయ్ సేతుపతి, మిస్కిన్ కాంబోలో ‘ట్రైన్’ ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 4న థియేటర్లలోకి కంఫర్ట్ జోన్ దాటి విభిన్న పాత్రలే లక్ష్యం.. వృషకర్మ విశేషాలు పంచుకున్న మీనాక్షి చౌదరి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం.... ముగ్గురు ఆడపిల్లలు మృతి ఉత్సవాలకు హాజరుకావాలని ఎంపీకి ఆహ్వానం వచ్చే ఎన్నికలే లక్ష్యం: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్ యాక్షన్ ప్లాన్ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* ఆకాశంలో ఒక తార సక్సెస్.. దుల్కర్ లేకపోతే ఇంత అందమైన సినిమా చూసేవాళ్లం కాదు: రాజమౌళి నోముల–ఆగపల్లి లింక్ రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి బీఆర్‌ఎస్‌ ఇడుపు కాయితం నుంచి ఉల్లిపూల సాంగ్ రిలీజ్.. ప్రియదర్శి, నాగదుర్గ జోడీకి మంచి స్పందన *తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ - 2026 రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషం.* ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవురామ్ దంపతులను కలసిన సర్పంచ్ చెవ్వా శివారెడ్డి విదేశీ ఉద్యోగాలకు తోడ్పాటు.. రూ.1.75 లక్షల వరకు ఆర్థిక సా 48 ఏళ్ల క్రితం ఆ అలవాటు తిరస్కరించా.. అందుకే మెగాస్టార్ అయ్యా: నషా ముక్త్ భారత్ వేదికపై చిరంజీవి ఇంట్లో వర్కౌట్ దృశ్యాలు పంచుకున్న రష్మిక మందన్న.. గాయం తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి భోగి సినిమాపై తీవ్ర విమర్శలు, ట్రోల్స్.. రక్తపాతంపై నెటిజన్ల అసహనం

ఇడుపు కాయితం నుంచి ఉల్లిపూల సాంగ్ రిలీజ్.. ప్రియదర్శి, నాగదుర్గ జోడీకి మంచి స్పందన

Select Suryaa Now
ఇడుపు కాయితం నుంచి ఉల్లిపూల సాంగ్ రిలీజ్.. ప్రియదర్శి, నాగదుర్గ జోడీకి మంచి స్పందన

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న గ్రామీణ నేపథ్య చిత్రం ఇడుపు కాయితం నుంచి తాజాగా ఉల్లిపూల పాటను చిత్ర బృందం విడుదల చేసింది. విభిన్నమైన టైటిల్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను మేకర్స్ మరింత వేగవంతం చేశారు. గ్రామీణ వాతావరణం, సహజమైన సన్నివేశాలతో సాగుతున్న ఈ పాట శ్రోతలను, ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.

సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ పాటకు అభినయ శ్రీనివాస్ సాహిత్యం సమకూర్చగా, హేనా గ్రేస్ ఆలపించారు. పల్లెటూరి నేటివిటీకి తగ్గట్టుగా రూపొందించిన బాణీ, ఆకట్టుకునే సాహిత్యం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పటికే విడుదలైన ఇతర పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన రాగా, ఇప్పుడు ఉల్లిపూల పాట కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి బన్నీ వాస్ వర్క్స్, తబిత సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలంగాణ జానపద కళాకారిణిగా గుర్తింపు పొందిన నాగదుర్గ ఈ చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయం అవుతుండటం విశేషం. అభినవ్ గోమటం, అభయ్ బేతిగంటి, రచ్చ రవి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఇడుపు కాయితం చిత్రం డిసెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రచార వేగాన్ని పెంచుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.