*ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలంలో పులి సంచారం కలకలం!* *అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు ఫారెస్ట్ అధికారుల సూచన*
సూర్య... మధిర
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎరుపాలెం మండల పరిధిలో పెద్దపులి సంచరిస్తోందనే సమాచారంతో స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. పులి సంచారం వార్త మండలంలోని గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు ఆందోళన చెందుతున్నారు.పులి సంచారంపై అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పులి పాదముద్రలు, ఇతర ఆనవాళ్లను గుర్తించి అసలు విషయం నిర్ధారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.పులి సంచారం ఉన్నట్లు సమాచారం అందితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకూడదు. పశువులను పొలాలు, అటవీ ప్రాంతాల సమీపంలో ఒంటరిగా వదలకూడదు. పులి కనిపిస్తే దాని దగ్గరకు వెళ్లడం, ఫొటోలు తీసేందుకు ప్రయత్నించడం, గుంపులుగా చేరడం చేయకూడదు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలి.
ప్రజల భద్రత దృష్ట్యా అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టి పులి సంచారంపై స్పష్టత ఇవ్వాలని మండల ప్రజలు కోరుతున్నారు.
????ఎర్రుపాలెం మండలం గుంటుపల్లి గోపవరం పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుందన్న సమాచారంతో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, సూచనలు ఇస్తున్న మధిర రూరల్ సిఐ D . మధు గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు మరియు సిబ్బంది.