దేశ సేవే లక్ష్యంగా బీజేపీ నిరంతర కృషి: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
పెద్దేముల్, మేజర్ న్యూస్: దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ నిరంతరం పనిచేస్తోందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం పెద్దేముల్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ప్రయోజనాలే పరమావధిగా బీజేపీ ముందుకు సాగుతోందని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి రమేష్ కుమార్ తో పాటు మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.