BREAKING
బంగ్లాదేశ్ సంక్షోభంతో భారత్‌కు పెరుగుతున్న దుస్తుల తయారీ ఆర్డర్లు.. దేశీయ పరిశ్రమకు కలిసొస్తున్న అవకాశం! యాదమరిలో ఎన్నికల బందోబస్తుకు 100 మంది పోలీసులు దేశ సేవే లక్ష్యంగా బీజేపీ నిరంతర కృషి: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రానికి ఖర్గే హెచ్చరిక డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు మేకల కాస్తుండగా రైలు ఢీకొని ఓ మహిళా మృతి.. మాల్దీవుల వెకేషన్ ఫొటోలతో ఆకట్టుకుంటున్న నటి సాక్షి మాలిక్.. గ్లామర్ లుక్ వైరల్ *ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలంలో పులి సంచారం కలకలం!* *అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు ఫారెస్ట్ అధికారుల సూచన* మాస్ ప్రయోగాలకు బ్రేక్.. ఫ్యామిలీ, లవ్ స్టోరీలపై నాని దృష్టి విజయ్ సేతుపతి, మిస్కిన్ కాంబోలో ‘ట్రైన్’ ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 4న థియేటర్లలోకి కంఫర్ట్ జోన్ దాటి విభిన్న పాత్రలే లక్ష్యం.. వృషకర్మ విశేషాలు పంచుకున్న మీనాక్షి చౌదరి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం.... ముగ్గురు ఆడపిల్లలు మృతి ఉత్సవాలకు హాజరుకావాలని ఎంపీకి ఆహ్వానం వచ్చే ఎన్నికలే లక్ష్యం: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్ యాక్షన్ ప్లాన్

డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రానికి ఖర్గే హెచ్చరిక

Select Suryaa Now
డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రానికి ఖర్గే హెచ్చరిక
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై విపక్ష 'ఇండీ కూటమి' తమ వ్యూహాన్ని ఖరారు చేసింది. శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఈ కీలక సమావేశానికి 12 విపక్ష పార్టీల నేతలు, ఒక ఇండిపెండెంట్ ఎంపీ (కపిల్ సిబల్) హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా టీఎంసీ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, వామపక్షాల ప్రతినిధులు పాల్గొన్న ఈ భేటీలో బిల్లును పార్లమెంట్ వేదికగా తీవ్రంగా వ్యతిరేకించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.

సమావేశం అనంతరం మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ డీలిమిటేషన్ విషయంలో ఇండీ కూటమి తరఫున కేంద్రానికి మూడు ప్రధాన డిమాండ్లను ముందుంచారు. లోక్‌సభ ప్రస్తుత స్థానాల సంఖ్యను పెంచకూడదని, ఉన్న సీట్లలోనే మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని కూటమి స్పష్టం చేసింది. అలాగే రాష్ట్రాల వారీగా ప్రస్తుత సీట్ల వాటాను మరో 25 ఏళ్ల పాటు యథాతథంగా కొనసాగించాలని, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను తాజా జనాభా లెక్కల ఆధారంగానే చేపట్టాలని డిమాండ్ చేసింది.

ఈ సందర్భంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో '400 పార్' నినాదం విఫలం కావడంతో, ఇప్పుడు లోక్‌సభ స్థానాలను 850కి పెంచి '800 పార్' లక్ష్యంతో శాశ్వతంగా అధికారంలో కొనసాగాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని, జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ సీట్లు పెరిగేలా ఎలాంటి నిబంధనలు చేర్చలేదని ఖర్గే మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తోందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు తాము ఈ బిల్లును అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు.