యాదమరిలో ఎన్నికల బందోబస్తుకు 100 మంది పోలీసులు
యాదమరి, నవంబర్ 28: యాదమరి మండల పరిధిలోని 16 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. ఎన్నికల విధుల కోసం మొత్తం 100 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు.
సీఐ శ్రీధర్ నాయుడు, ఎస్సై ఈశ్వరయ్య, మరో ఎస్సై ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మండలంలో మొత్తం 84 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వాటిలో ఆరు కేంద్రాలను సెన్సిటివ్ కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని చర్యలు చేపట్టిందని చెప్పారు. ప్రజలు పోలీసులకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని డీఎస్పీ మహబూబ్ బాషా కోరారు.
ఫైరోజ్ బాషా సూర్య ప్రతినిథి యాదమరి