ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు ప్రారంభం
సూర్య బెజ్జుర్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం ఉట్స్ సారంగపల్లి గ్రామపంచాయతీలో ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు కార్యక్రమాన్ని సర్పంచ్ ఏనుక శ్రీహరి, ఉపసర్పంచ్ కొండ్ర రవీందర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అర్హులైన కుటుంబాలు బీమా నమోదు చేసుకొని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.