telangana
తెలుగు రాష్ట్రాల్లో సేల్స్ బీజ్ యాప్ ప్రారంభం
అమీర్‌పేట,మేజర్ న్యూస్:తెలుగు రాష్ట్రాల్లో సేల్స్ బీజ్ యాప్ సేవలు ప్రారంభమయ్యాయి. అందుకు సంబంధించిన వివరాలను సంస్థ సీఎండీ కుకట్ల శ్రీనివాస్ గురువారం వెల్లడించారు.ఈ విషయమై ఆయన మాట్లాడుతూ సామాన్య,మధ్య తరగతి కుటుంబాల నెలవారీ కిరాణ బడ్జెట్ పై భారం తగ్గించడమే తమ సంస్థ లక్ష్యమన్నారు.ఆన్‌లైన్ (ఈ-కామర్స్),ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్‌లు, 10 నిమిషాల క్విక్-కామర్స్ సేవలను ఒకే వేదికపైకి తెస్తూ దేశంలోనే తొలిసారిగా సరికొత్త ట్రై మోడల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.30 దేశాల్లో నాలుగేళ్ల పాటు మార్కెట్ తీరుతెన్నులపై లోతైన అధ్యయనం చేసిన అనంతరం,రీటైల్ రంగంలో 30–40 ఏళ్ల అనుభవమున్న నిపుణుల నేతృత్వంలో దీనిని రూపొందించామన్నారు.ఈ యాప్ ద్వారా గ్రోసరీస్, పండ్లు, కూరగాయలు,గృహోపకరణాలు, ఎలక్ట్రికల్ వస్తువులను ఒకే చోట కొనుగోలు చేయవచ్చన్నారు. నెలకు సగటున రూ. 10 వేల వరకు సరుకులు కొనే కుటుంబాలకు రూ. 500 నుంచి రూ.1,000 వరకు ఆదా అయ్యేలా ధరలను నిర్ణయించామన్నారు.అంతేకాకుండా హైదరాబాద్‌లో ఇప్పటికే 600 డార్క్ స్టోర్‌లను సిద్ధం చేశామన్నారు.రాబోయే సంక్రాంతి తర్వాత కేవలం 10 నిమిషాల్లోనే వినియోగదారుల ఇంటి వద్దకు సరుకులను చేరవేస్తామని తెలియజేశారు. యాప్ విడుదలైన తొలి గంటలోనే 10 లక్షల డౌన్‌లోడ్స్ నమోదు కాగా,రెండు నెలల్లో కోటి డౌన్‌లోడ్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించారు.మరోవైపు ఎస్‌బీ స్టోర్స్ (మినీ, మార్కెట్,సూపర్ స్టోర్ విభాగాలు) ఫ్రాంచైజీల ఏర్పాటుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 1.60 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు.దరఖాస్తుదారుల ఆర్థిక సామర్థ్యం, నేపథ్యాన్ని పరిశీలించి స్టోర్‌లను కేటాయిస్తున్నామని తెలిపారు.సరుకుల సరఫరా (ఇన్వెంటరీ), టెక్నాలజీ,మార్కెటింగ్, ప్రకటనలు, రిటర్న్స్ వంటి బాధ్యతలన్నింటినీ కంపెనీయే పూర్తిగా చూసుకుంటుందన్నారు