BREAKING
మూసాపేట లేఅవుట్ ఈ-వేలానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. స్టే ఉత్తర్వులు లేవు! సూప్‌లో బొద్దింకలు.. జిస్మత్ మండి రెస్టారెంట్‌పై చర్యలు రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన అవసరం : ఆచార్య జి.నాగరాజు సైబరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్‌ మొబైల్ అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిదీ: నాగార్జునరెడ్డి పీవి ధ్వయం జీవన రేఖలు పుస్తకావిష్కరణ పారిశుధ్య నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవు *జీహెచ్‌ఎంసీ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో విస్తృత తనిఖీలు రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ పిలుపు కాంగ్రెస్ 'సంవిధాన్ రక్షక్ మార్చ్' కు..ర్యాలీగా తరలిన 'మైనంపల్లి' రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తోంది : కోట నీలిమ సెంటర్ కోర్ట్ పికిల్‌బాల్ లీగ్ సీజన్-2  భాగస్వామిగా 'యూత్ ఫీడ్ ఫౌండేషన్ తెలుగు రాష్ట్రాల్లో సేల్స్ బీజ్ యాప్ ప్రారంభం పంజాగుట్ట జివికె వన్ వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి - 23 కుటుంబాల్లో ఆనందం

సెంటర్ కోర్ట్ పికిల్‌బాల్ లీగ్ సీజన్-2  భాగస్వామిగా 'యూత్ ఫీడ్ ఫౌండేషన్

Select Suryaa Now
సెంటర్ కోర్ట్ పికిల్‌బాల్ లీగ్ సీజన్-2  భాగస్వామిగా 'యూత్ ఫీడ్ ఫౌండేషన్
అమీర్‌పేట,మేజర్ న్యూస్:క్రీడలను సామాజిక బాధ్యతతో అనుసంధానిస్తూ సెంటర్ కోర్ట్ పికిల్‌బాల్ లీగ్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సీజన్-2 టోర్నమెంట్ కోసం అధికారిక ఎన్జీఓ భాగస్వామిగా యూత్ ఫీడ్ ఫౌండేషన్ తో జతకట్టినట్లు ప్రకటించింది. సెంటర్ కోర్ట్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫౌండర్ యశ్వంత్ బియ్యాల,యూత్ ఫీడ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ షాజ్ మెహమూద్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.వారు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల పిల్లలు,ముఖ్యంగా వలస,రోజువారీ కూలీల కుటుంబాల పిల్లల పోషకాహారం,ఆరోగ్య సంక్షేమానికి తోడ్పడేందుకు క్రీడా వేదికను ఉపయోగించుకోవడమే తమ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశం అన్నారు.ఈ భాగస్వామ్యం ద్వారా కేవలం నిధుల సేకరణ మాత్రమే కాకుండా,యూత్ ఫీడ్ ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించనున్నామని పేర్కొన్నారు. ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు,పెరుగుతున్న క్రీడాకారులు,జట్టు యజమానుల నెట్‌వర్క్‌తో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ఆసక్తిగల ప్రేక్షకుల మద్దతును ఫౌండేషన్ సేవలకు అనుసంధానించాలని సీసీపీఎల్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు.లీగ్ కమ్యూనిటీ సభ్యులందరూ ఈ సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాలుపంచుకునేలా ప్రత్యేక అవకాశాలను కల్పించనున్నట్లు వెల్లడించారు.లీగ్ సాగినంత కాలం ఫౌండేషన్‌కు మరింత గుర్తింపు లభించేలా క్షేత్రస్థాయి కార్యక్రమాలు,కమ్యూనిటీ యాక్టివిటీలను నిర్వహించనున్నామని తెలియజేశారు.ముఖ్యంగా మ్యాచ్‌లు జరిగే రోజుల్లో చేపట్టే ప్రత్యేక కార్యక్రమాల ద్వారా క్రీడాభిమానులు ఫౌండేషన్ పనితీరు గురించి తెలుసుకోవడంతో పాటు,వారి సేవా ప్రయత్నాలలో స్వయంగా భాగస్వాములయ్యే అవకాశం లభిస్తుందన్నారు.క్రీడల ద్వారా ఏర్పడే ఐక్యతను మైదానం వెలుపల కూడా అర్థవంతమైన మార్పు కోసం ఉపయోగించాలనే సంకల్పంతో ఈ ముందడుగు వేసినట్లు ప్రకటించారు.