అభివృద్ధిలో కీలక పాత్ర పోషించండి టిడిపి సర్పంచులకు పరిటాల శ్రీరామ్ పిలుపు పరిటాల శ్రీరామ్ ను ఘనంగా సత్కరించిన టిడిపి సర్పంచులు
ధర్మవరం రూరల్ నవంబర్ 29 మేజర్ న్యూస్
ధర్మవరం మండలంలో టీడీపీ మద్దతుతో గెలుపొందిన నూతన సర్పంచులు శనివారం అనంతపురంలోని శ్రీ సత్యసాయి జిల్లా జడ్పీ చైర్మన్, ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులతో శ్రీరామ్ నివాసం సందడిగా మారింది. ఈ సందర్భంగా సర్పంచులు ఆయనను బొకేలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ పంచాయతీల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామ స్థాయి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ క్లస్టర్ ఇన్‌చార్జ్ మహేష్ చౌదరి, ప్రధాన కార్యదర్శి విజయసారథి, సింగిల్ విండో చైర్మన్ మేకల రామాంజనేయులు, ఏలుకుంట్ల సర్పంచ్ ఏగినాటి వెంకటరమణ, ధర్మపురి సర్పంచ్ గడుపుటి విజయ్ చౌదరి, చింతలపల్లి సర్పంచ్ పథకమూరి సౌభాగ్య, ఉప్పునేసినపల్లి సర్పంచ్ నారా మధురవాణి, మల్కాపురం సర్పంచ్ శివానంద, పోతుకుంట సర్పంచ్ వెంకటలక్ష్మి, సుబ్బారావుపేట సర్పంచ్ చిన్న గంగప్ప, సీసీ కొత్తకోట సర్పంచ్ జ్యోతి రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.