అభివృద్ధికి ఓటు వేయండి.. గ్రామ ప్రగతికి తోడ్పడండి! ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు
లేపాక్షి:- గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పి .చంద్రకళ కు మద్దతుగా తెలుగుదేశం నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు పులమతి గ్రామ పంచాయతీ లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలిసి తమ అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు. హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ సారధ్యంలో గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సమస్య పరిష్కారం, రహదారుల అభివృద్ధి, పారిశుద్ధ్యం తదితర అంశాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని వివరించారు.గ్రామ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే అభ్యర్థిని ఎన్నుకోవాలని, కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి పి. చంద్రకళ కు ఎన్నికల అధికారులు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని నాయకులు ఓటర్లను అభ్యర్థించారు.ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో విజయం సాధించి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని కూటమి నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
హిందూపురం స్టాఫ్ రిపోర్టర్ నాగేంద్ర