|
|
by Suryaa Desk | Fri, Apr 24, 2026, 03:13 PM
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. భారతదేశంతో పాటు విదేశాల్లోనూ రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలపై ఆసక్తి నెలకొంది. జియో హాట్‌స్టార్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ విడుదల కానుంది. జియో హాట్‌స్టార్‌తో రూ. 150 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న నిర్మాతలు, అంతర్జాతీయ ప్రేక్షకులను చేరుకోవడానికి నెట్‌ఫ్లిక్స్‌తోనూ భారీ ఒప్పందం చేసుకునే ప్రక్రియలో ఉన్నారు. త్వరలోనే అధికారంగా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించనుంది.
Latest News