|
|
by Suryaa Desk | Wed, Oct 01, 2025, 08:44 PM
థ్రిల్లర్ జోనర్ నుంచి వచ్చే కథలకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. ఈ జోనర్ నుంచి వచ్చిన సినిమాలు .. వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దాంతో ఈ తరహా కంటెంట్ పట్ల ఓటీటీ సంస్థలు ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాయి. ఈ జోనర్ నుంచి త్వరలో పలకరించనున్న మరో సిరీస్ గా 'కుట్రం పురిందవన్' కనిపిస్తోంది. 'కొన్ని రహస్యాలను ఎప్పటికీ దాచలేం' అనేదే ఈ కథలోని ప్రధానమైన అంశం.
సెల్వమణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, విదార్థ్ - లక్ష్మీప్రియ చంద్రమౌళి ప్రధానమైన పాత్రలను పోషించారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి చెందిన ఈ కథ, అనూహ్యమైన మలుపులతో ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించనుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను 'సోనీ లివ్' వారు దక్కించుకున్నారు. త్వరలో ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక పాప తల్లి చుట్టూ తిరిగే కథ ఇది. ఒక పోలీస్ ఆఫీసర్ ఎంతో నిజాయితీగా తన సర్వీస్ ను కొనసాగిస్తూ వస్తాడు. ఇక కొన్ని రోజులలో అతను రిటైర్ కావలసి ఉంటుంది. అలాంటి సమయంలో ఆపదలో ఉన్న ఒక వ్యక్తికి సహకరించడానికి ప్రయత్నిస్తాడు. ఫలితంగా 'మెర్సీ' అనే ఒక పాప కిడ్నాప్ కి సంబంధించిన కేసులో చిక్కుకుంటాడు. ఆ కిడ్నాప్ చేసింది తాను కాదని చెప్పలేని పరిస్థితులలో అతను ఉంటాడు. ఆ పరిస్థితులు ఏమిటి అందుకు కారకులు ఎవరు పాప ఏమైపోయింది అనేది కథ.
Latest News