వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ జిల్లా స్థాయి ఎంపికలు
సూర్య మంచిర్యాల టౌన్ : మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2027లో భాగంగా శనివారం ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అనే అంశంపై జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జై కిషన్ ఓజా అధ్యక్షత వహించగా,జిల్లా నోడల్ అధికారిగా డాక్టర్ ఎం. కుమారస్వామి వ్యవహరించారు.జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీ,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అంశంపై మాట్లాడేందుకు న్యాయనిర్ణేతలు ఒక్కొక్కరికి మూడు నిమిషాల సమయం కేటాయించారు.విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా,స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ అభిప్రాయాలను ప్రసంగాల రూపంలో వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జై కిషన్ ఓజా మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను అభినందించారు.యువత ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని,ఎన్నికలపై అవగాహన లేని వారిలో చైతన్యం తీసుకురావాలని సూచించారు.ప్రజాస్వామ్యంలో ఓటరుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని,దేశాభివృద్ధిలో ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.ఓటు వేసే సమయంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని,దేశ భవిష్యత్తు నేటి యువత చేతుల్లోనే ఉందని విద్యార్థులకు సూచించారు.