చింతారెడ్డిపాళెంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైసీపీ మేయర్ అభ్యర్థి కుటుంబ సభ్యులు
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్లో వైసీపీ మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చింతారెడ్డిపాళెంలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు హక్కు ప్రాధాన్యతను చాటుతూ ఎన్నికల్లో భాగస్వాములయ్యారు.