తెలుగుదేశం పార్టీలో చేరిన వైసిపి నాయకులు
బుట్టాయగూడెం : మేజర్ న్యూస్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు అధ్యక్షతన, బుసరాజుపల్లిలోని టీడీపీ నియోజకవర్గం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం పార్టీలో చేరారు.
మండలంలోని పాత రాజానగరం గ్రామానికి చెందిన 15 మంది వైసీపీ నాయకులు టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బొరగం శ్రీనివాసులు తెలుగు యువత నాయకులు మొగపర్తి పవన్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.