అభివృద్ధిని చూసి ఓటు వేయండి - కాపా శ్రీనివాసరావు
నూజివీడు, మేజర్ న్యూస్: గ్రామ సర్పంచ్ గా పనిచేసిన కాలంలో రావి చర్ల గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి దేశంలోనే అగ్ర గ్రామీగా నిలిపానని వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, బూర్వంచ ఎంపీటీసీ అభ్యర్థి కాపా శ్రీనివాసరావు తెలిపారు. బోర్వంచ ఎంపీటీసీగా తనని గెలిపిస్తే ఈ గ్రామాన్ని అత్యుత్తమ గ్రామంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కాపా శ్రీనివాసరావు బోర్వంచ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జరుగుతున్న అభివృద్ధిని వివరించి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రావి చర్ల గ్రామ సర్పంచ్ గా పనిచేసిన సమయంలో రావిచెర్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ఉత్తమ సర్పంచి పురస్కారాన్ని అందుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇది తరహాలో బూర్వంచ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తారని స్పష్టం చేశారు. అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.