telangana
గణపతి సచ్చిదానంద స్వామీజీని దర్శించుకున్న రాజ్ ఠాకూర్ దంపతులు!
సూర్య-గోదావరిఖని:పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాటారం మండలంలోని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్వగ్రామమైన ధన్వాడకు ఆదివారం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సంగీత విద్వాంసులు, మైసూరులోని అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో లోకకల్యాణార్థం నిర్వహించిన ప్రత్యేక మహాపూర్ణాహుతి కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్, ఆయన సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దంపతులతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు గణపతి సచ్చిదానంద స్వామీజీని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహంతో రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుభిక్షం కలగాలని వారు ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-